Begin typing your search above and press return to search.
నేను వస్తున్నా ఎవడొచ్చి ఆపుతాడో ఆపుకోండి!
By: Tupaki Desk | 4 Sept 2020 8:00 PM ISTబాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మొదటి నుండి కూడా ఫైర్ బ్రాండ్. సుశాంత్ మృతి చెందినప్పటి నుండి ఆమె వాయిస్ మరీ ఎక్కువ అయ్యింది. నెపొటిజంకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఇబ్బంది పెట్టాయి. బాలీవుడ్ లోని కొందరిని మాఫియా అంటూ సంభోదిస్తూ వారికి నిద్ర లేని రాత్రులు బహుమానంగా ఇచ్చింది. కంగనాపై ఎంతో మంది ఎన్నో రకాలుగా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అయ్యింది.
ఈమద్య కాలంలో అధికార పార్టీ నాయకులపై యువ నాయకుడిపై కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆమె మరింత వివాదంలో చికుకున్నట్లయ్యింది. లాక్ డౌన్ విధించినప్పటి నుండి మనాలిలో ఉంటున్న కంగనాను ముంబయికి ఇకపై రానిచ్చేది లేదు అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. తనను ముంబయిలో అడుగు పెట్టనివ్వము అంటూ హెచ్చరిస్తున్న వారికి షాకింగ్ కౌంటర్ ఇచ్చింది. నేను ఈనెల 9న ముంబయిలో ల్యాండ్ అవ్వబోతున్నాను. ముంబయి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యే సమయాన్ని కూడా నేను చెప్తాను. ఎవడి అబ్బకు అయినా దమ్ముంటే వచ్చి నన్ను ఆపండి అంటూ కంగనా ఛాలెంజ్ చేసింది.
ఒక హీరోయిన్ ఈ స్థాయి ఛాలెంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈమె చాలా పెద్ద రిస్క్ చేస్తుంది అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం పార్టీ నాయకులతో మరియు బాలీవుడ్ ప్రముఖులతో ఢీ కొట్టడం అంటే ప్రాణాలతో చెలగాటం అంటూ అభిమానులు భయపడుతున్నారు. ముంబయి పోలీసులు కంగనాకు భద్రత కల్పించాలని లేదంటే ఆమె ముంబయికి వస్తే ఏం అయినా జరిగే అవకాశం ఉందంటూ కొందరు ఆమె అభిమానులు మరియు బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.