Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ప్లాప్ కంటెంట్ పై క్వీన్ సెటైర్లు!

By:  Tupaki Desk   |   5 Nov 2022 1:30 PM GMT
బాలీవుడ్ ప్లాప్ కంటెంట్ పై క్వీన్ సెటైర్లు!
X
కొంత కాలంగా బాలీవుడ్ ని బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా వైఫ‌ల్యాల‌తో ఇండ‌స్ర్టీ సంక్ష‌భంలో కూరుకుపోతుంది. భారీ బ‌డ్జెట్ తో భారీ అంచ‌నాల మ‌ధ్య‌ రిలీజ్ అయిన సినిమాల‌న్ని దారుణ‌మైన వైఫ‌ల్యాల్ని చ‌వి చూస్తున్నాయి. చిన్న చిత‌కా సినిమాలు మిన‌హా స్టార్ హీరోలంద‌రూ విజ‌యం కోసం వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మునుపెన్న‌డు బాలీవుడ్ కి ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌లేదు. కోవిడ్ ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి నేటి వ‌ర‌కూ ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. స‌క్సెస్ కోసం ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. కొన్ని నెల‌లుగా ఇండ‌స్ర్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎవ‌రికి వారు విశ్లేష‌ణ‌ చేసారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కూడా త‌న‌దైన శైలిలో ప‌రిశ్ర‌మ స్థితిగ‌తిల్ని విశ్లేషించింది.

ద‌క్షిణాది సినిమాలు భారీ విజ‌యాలు అందుకుంటున్నాయి అంటే దానికి కార‌ణం భార‌తీయ మూలాలు ప్ర‌తిబింబించే క‌థ వాటిలో ఉండ‌ట‌మే. వాటికి ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. సౌత్ కంటెంట్ హిట్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే. పాశ్చాత్య సంస్కృతి ఉన్న క‌థ‌ల్ని అక్క‌డ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. మ‌న‌వాళ్లు ఇలాంటి క‌థ‌ల్నే ప‌నిగ‌ట్టుకుని తీస్తున్నారు.

అందుకే మ‌న‌వాళ్ల‌కి బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశే ఎదుర‌వుతుంది. ఈ ఏడాది నా నుంచి వ‌చ్చిన ఒక్క చిత్రం కూడా ఇలాంటి కార‌ణంతోనే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌నుకుంటున్నా' అని అభిప్రాయ ప‌డింది. కంగ‌న న‌టించ‌ని చిత్రాలు ఇటీవ‌ల ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని సంగ‌తి తెలిసిందే కోవిడ్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రెండు సినిమాల‌తో (త‌లైవి...ధాక‌డ్) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

రెండు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. మొత్తానికి కంగ‌న సౌత్ కంటెంట్ స‌క్సెని ప‌సిగ‌ట్టింది. మ‌రి ఇక నుంచి కంగ‌న నుంచి వ‌చ్చే సినిమాల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డే అవ‌కాశం ఉంది. కంగ‌న సొంతంగానే సినిమాలు స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తుంది కాబ‌ట్టి భారీ మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది.

ప్ర‌స్తుతం కంగ‌న దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ కాలంనాటి ప‌రిస్థిల్ని ఆధారంగా చేసుకుని 'ఎమెర్జెన్సీ' అనే సినిమా చేస్తోంది. చ‌రిత్ర గ‌ర్భంలో క‌లిసి పోయిన కొన్ని వాస్త‌వాల్ని కంగ‌న సినిమా ద్వారా తవ్వి తీస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.