Begin typing your search above and press return to search.
కంగనా హంగామా మళ్ళీ షురూ..!
By: Tupaki Desk | 18 Feb 2019 6:13 AM GMTకంగనా అంటే బాలీవుడ్ క్వీన్. అదేమీ సాధారణ విషయం కాదుగా? అంతంతమాత్రం ఉండే అత్తెసరు భామలే నేలమీద నిలవరు. ఇక కంగనా నుంచి అలాంటివి ఎలా ఆశించగలం? అసలే క్వీన్.. ఆపై 'మణికర్ణిక' విజయంతో ఫుల్ జోష్ మీద ఉంది. దీంతో తన నెక్స్ట్ సినిమా 'మెంటల్ హై క్యా' నిర్మాతల ముందు ఒక డిమాండ్ ఉంచిందట.
ఇంతకీ ఆ డిమాండ్ ఏంటంటే 'మెంటల్ హై క్యా' సినిమాకు ముందుగా తన సోలో పోస్టర్లనే విడుదల చేయాలట. ఈ సినిమాలో హీరో రాజ్ కుమార్ రావు. తను చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ కానీ ఇంకా స్టార్డమ్ మాత్రం రాలేదు. మరి ఏమనుకుందో ఏమో గానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో తనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని అంటుందట. 'మణికర్ణిక' విజయంతో తన స్టార్డమ్ మరింతగా పెరిగింది కాబట్టి తనకు ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలని భావిస్తోందట. ఇంతటితో ఆగలేదు. తన సోలో పోస్టర్లు రిలీజ్ చేసేవరకూ షూటింగ్ లో పాల్గొనేది లేదని వారికి తెగేసి చెప్పిందట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
అందగత్తె అలిగినా అందమే.. డిమాండ్లు చేసినా అందమే. ఏం చేసినా అందమే. అందుకని 'మెంటల్ హై క్యా' నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండదు. త్వరలో సోలో పోస్టర్స్ రావడం ఖాయమే. ఒకవేళ రాజ్ కుమార్ రావు అప్సెట్ అయ్యి ఏదైనా తన మనసులోని బాధను మీడియాతో చెప్పుకుంటే అదో వివాదం అవుతుంది. ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడితే రంగోలి చందేల్ రంగంలోకి దిగుతుంది. ఎన్ని సార్లు చూడలేదు..!