Begin typing your search above and press return to search.

స్టార్ హీరో నుంచి ర‌హ‌స్య కాల్స్ వ‌చ్చాయ‌‌ని బాంబ్ పేల్చింది!

By:  Tupaki Desk   |   8 April 2021 6:30 AM GMT
స్టార్ హీరో నుంచి ర‌హ‌స్య కాల్స్ వ‌చ్చాయ‌‌ని బాంబ్ పేల్చింది!
X
వివాదం ప్ర‌తిభ ఒకే ఒర‌లో ఇమిడితే అది కంగ‌న అని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వివాదం లేనిదే కంగ‌న లేదు. సాటి నాయిక‌ల‌తో అగ్ర హీరోల‌తో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌తో రాజ‌కీయ నాయ‌కుల‌తో కంగ‌న వివాదాల గురించి తెలిసిన‌దే. కేంద్రంలోని భాజ‌పా ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప్ర‌త్య‌ర్థుల్ని టార్గెట్ చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు కంగ‌న‌పై ఉన్నాయి.

ఇక బాలీవుడ్ మాఫియాని సూటిగా విమ‌ర్శించి పేర్లు బ‌య‌ట‌పెట్టేసేందుకు కంగ‌న ఏమాత్రం వెన‌కాడ‌దు. ఇండ‌స్ట్రీ మాఫియాలో చోప్రాలు క‌పూర్ లు రోష‌న్ లు జోహార్ లు భ‌న్సాలీలు ఉన్నార‌ని చెప్పింది కంగ‌న‌నే.

ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ హీరో నుంచి త‌న‌కు ర‌హ‌స్య కాల్స్ వ‌చ్చాయ‌ని వ్యాఖ్యానించి బిగ్ బాంబ్ విసిరింది. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరో.. ఏమా ర‌హ‌స్య కాల్? అన్న‌ది విచారిస్తే.. తెలిసిన సంగ‌తి నిశ్చేష్ఠుల్ని చేస్తుంది.

కంగ‌న తాను న‌టించిన సినిమాల ట్రైల‌ర్స్ ప్రోమోల‌ను సాటి నాయిక‌లు కానీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎవ‌రైనా కానీ పొగ‌డ‌ర‌ని అయితే తన‌కు ర‌హస్యంగా కాల్ చేసి పొగుడుతార‌ని చెప్పారు. వీళ్లంతా బ‌హిరంగంగా త‌న‌ని కీర్తిస్తే మాఫియా నుంచి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటార‌ని అందుకే వారు ఎవ‌రూ అలా చేయ‌ర‌ని కంగ‌న అన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్ నుండి రహస్య కాల్స్ వచ్చాయని కంగనా రనౌత్ అన్నారు. త‌లైవి ట్రైల‌ర్ ని ఆయ‌న ర‌హ‌స్యంగా కాల్ చేసి ప్ర‌శంసించార‌ట‌. ఇక చాలా మంది బాలీవుడ్ నాయిక‌లు త‌న‌కు ర‌హ‌స్యంగా కాల్ చేసి ప్ర‌శంసించార‌ని తెలిపారు. ఇక దీపిక ఆలియా ల విష‌యంలో బ‌య‌ట‌కు ప్ర‌శంశ‌లు కురిపించే ప‌రిశ్ర‌మ త‌న‌ను మాత్రం అలా చూడ‌ద‌ని .. అదంతా మాఫియా మ‌హిమ అని మ‌రోసారి బాలీవుడ్ ని షేక్ చేసింది కంగ‌న‌.

బాలీవుడ్ లో స్నేహపూర్వకంగా లేర‌ని చాలా మంది నటులు తన తలైవిని రహస్య కాల్స్ సందేశాల ద్వారా ప్రశంసిస్తున్నారని అంటోంది క్వీన్. తన రాజకీయ అభిప్రాయాలు ఆధ్యాత్మికతను చూశాక కూడా బెదిరించి వేధింపులకు గురి చేసి ఒంటరితనానికి గురిచేయడం స‌రికాద‌ని కం‌గ‌న అన్నారు. క‌ళ‌ల విష‌యంలో రాజ‌కీయాలు త‌గ‌ద‌ని సినిమా విషయానికి వస్తే పవర్ ప్లే రాజకీయాలలో మునిగిపోకూడదని కంగ‌న సూచించారు. తన తలైవి ట్రైలర్ ను ప్రశంసించేందుకు ర‌హ‌స్య కాల్స్ వ‌స్తున్నాయ‌ని కంగ‌న చెప్ప‌డంపై అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు.