Begin typing your search above and press return to search.
జర్నలిస్ట్ పై మళ్లీ విరుచుకు పడ్డ స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 8 July 2019 11:49 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్. ఈ అమ్మడు తాజాగా 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. తన ప్రతి సినిమా విషయంలో కూడా వివాదాలను మూట కట్టుకుంటూ ఉండే కంగనా రనౌత్ తాజాగా ఆ చిత్రం ప్రమోషన్ సందర్బంగా కూడా ఒక జర్నలిస్ట్ పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేసి వివాదాస్పదం అయ్యింది.
గతంలో 'మణికర్ణిక' చిత్రం విడుదల సందర్బంగా ఒక జర్నలిస్ట్ పాకిస్తాన్ లో షో లు ఇచ్చే ఇండియన్ సినీ స్టార్స్ ను వ్యతిరేకించే కంగనా రనౌత్ తన సినిమాను పాకిస్తాన్ లో విడుదల చేయడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. దేశ భక్తురాలిని అని చెప్పుకునే కంగనా ఇలా చేయడం ఏంటని అప్పుడు కథనంను రాయడం జరిగింది. అప్పుడు జర్నలిస్ట్ రాసిన కథనంకు 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రం సాంగ్ విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన్ను టార్గెట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసింది.
కంగనా ఆయన్ను ఉద్దేశించి.. నా మణికర్ణిక చిత్రం గురించి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేశావు. ఆ సినిమాను చేసి నేను తప్పు చేశానా? జాతీయవాది అంటూ నాపై ముద్ర వేశావు. గతంలో మీకు నేను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇవ్వమన్నా కూడా మూడు గంటలు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు నన్ను బాగా మెచ్చుకున్నారు అంటూ కంగనా అతడిని ఉద్దేశించి కోపంతో వ్యాఖ్యలు చేసింది. దాంతో మీడియా సమావేశం అంతా ఒక్కసారిగా రసాబాసగా మారింది. నిర్మాత మరియు హీరో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కంగనా దుడుకు స్వభావంతో ఇలాంటి వివాదాలను తరచు ఎదుర్కొంటూనే ఉంటుంది.

For Video Click Here