Begin typing your search above and press return to search.
మద్దతు ఇస్తున్న వారిని కూడా ఏకిపారేస్తోంది
By: Tupaki Desk | 12 Sep 2020 10:30 AM GMTబాలీవుడ్ లో గత రెండు మూడు సంవత్సరాలుగా చాలా మంది ప్రముఖులకు కంగనా కొరకరాని కొయ్యగా మారింది. ఆమె చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయలేక.. ఆమె చేస్తున్న ఆరోపణలు భరించలేక చాలా మంది సెలబ్రెటీలు ఆమె వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే సుశాంత్ మరణంతో కంగనా మరింత రెచ్చి పోయింది. బాలీవుడ్ లో ఉన్న మాఫియా కారణంగానే నెపొటిజం కారణంగానే సుశాంత్ మృతి చెందాడు అంటూ కరణ్ జోహార్.. మహేష్ భట్ తో పాటు మరికొందరిని టార్గెట్ చేసింది.
సుశాంత్ మృతి చెందినప్పటి నుండి కంగనా జాతీయ మీడియా నుండి మొదలుకుని గల్లీ మీడియా వరకు ప్రముఖంగా వినిపిస్తునే ఉంది. అన్ని మీడియాల్లో కూడా కంగనా హడావుడి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె మహా రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు పెట్టుకుంది. దాంతో ఆమె ఆఫీస్ ను ముంబయి మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణం అంటూ కూల్చి వేశారు. ఆ విషయంలో చాలా మంది కంగనాకు మద్దతుగా నిలిచారు. ఇన్నాళ్లు కంగనాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు చాలా కష్టపడి కంగనా ఈ స్థాయికి వచ్చింది. ఆమె ఎంతో మందికి ఆదర్శం. అలాంటి ఆమె భవనంను కూల్చి వేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా విమర్శలు కురిపించారు.
తనకు మద్దతుగా నిలిచిన కొందరిపై కంగనా విమర్శలు చేసింది. బాలీవుడ్ మాఫియాతో సంబంధం ఉన్న వారు నాకు మద్దతు తెలపడం ఇష్టం లేదు. ఒక స్టార్ సొమ్ముతో బతుకుతూ తనకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ తో సంబంధం ఉన్న వారితో నన్ను పక్కన పెట్టి నాకు సానుభూతి తెలియజేస్తున్న వారి సానుభూతి నాకు వద్దంది. తనకు మద్దుతుగా నిలిచిన వారిని కూడా ఏకీ పారేయడం కంగనాకే చెల్లిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.