Begin typing your search above and press return to search.
అదిరింది కంగనా.. ఒకేసారి అలా ఇలా
By: Tupaki Desk | 17 Feb 2020 5:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర మూవీ ‘తలైవి’లో నటిస్తున్న విషయం తెల్సిందే. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ శర వేగంగా జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను రివీల్ చేస్తూనే వస్తున్నారు. జయలిత గెటప్ లో కంగనా ఆకట్టుకుంటుందని స్టిల్స్ చూస్తుంటే అనిపిస్తుంది.
ఒక వైపు తలైవి చేస్తూనే మరో వైపు ఈ అమ్మడు తేజస్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనా ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ గా నటిస్తోంది. ఆర్ ఎస్ వీ పీ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూసిన వారు ఫిదా అవుతున్నారు. ఆ ఫిజిక్ ఆ బాడీ లాంగ్వేజ్ మరియు స్టైల్ అన్ని కూడా నిజంగా ఫైలైట్ మాదిరిగానే ఉందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కంగనా ఏ సినిమా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. ఆమె ఎంపిక చేసుకునే కథలు మరియు కాన్సెప్ట్ లు ఆమెకు బాగా యాప్ట్ అయినట్లుగా ఉంటాయని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. అలాగే తేజస్ కూడా తప్పకుండా ఆమెకు మరో విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈపోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.