Begin typing your search above and press return to search.
సేన ఎంపీకే సవాల్ విసిరిన కంగనా.. వస్తున్నా దమ్ముంటే అడ్డుకో
By: Tupaki Desk | 7 Sep 2020 9:50 AM GMTముక్కుసూటితనం.. అంతకు మించిన మొండితనం.. తాను తీసుకున్న స్టాండ్ విషయంలో ఏ మాత్రం తగ్గని బాలీవుడ్ సెలబ్రిటీగా కంగనా రౌనత్ ను చెప్పాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావటమే కాదు.. తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఆమె.. స్టార్ హీరోలు సైతం తలదూర్చని అంశాల గురించి మాట్లాడటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన కంగనా తీరు శివసేన నేతలకు ఏ మాత్రం నచ్చని వైనం తెలిసిందే.
ఈ ఎపిసోడ్ లో ముంబయి పోలీసుల దర్యాప్తు మీద తనకు నమ్మకం లేదంటూ బాలీవుడ్ క్వీన్ కమ్ ఫైర్ బ్రాండ్ కంగనారౌనత్ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. ముంబయి పోలీసులపై నమ్మకం లేకుండా ముంబయికి రావాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై తాజాగా కంగనా మరోసారి ఫైర్ అయ్యారు. తనను విమర్శిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. పురుష అహంకారిగా అభివర్ణించారు. దేశంలో మహిళలపై ఇన్ని ఘోరాలు.. అఘాయిత్యాలు జరగటానికి కారణం మేల్ ఇగోగా పేర్కొన్నారు.
గతంలో ముంబయి మహానగరంలో బతకలేకపోతున్నట్లుగా వ్యాఖ్యానించిన అమిర్ ఖాన్.. నసీరుద్దీన్ షాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కౌంటర్ ఇచ్చిన ఆమె.. ఒక మహిళను కావటంతోనే.. తనను ఉద్దేశించి ఆ స్థాయిలో సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓపెన్ సవాల్ విసిరారు. తాను ఈ నెల తొమ్మిదిన ముంబయికి వస్తున్నానని.. దమ్ముంటే తనను ఆపాలన్నారు.
తన సొంతిల్లున్న సిమ్లాలో ఉంటున్న కంగనా.. సుశాంత్ ఆత్మహత్య ఉదంతంలో పలు సందర్భంలో వీడియోలు షూట్ చేసి.. సోషల్ మీడియాలో విడుల చేశారు. సంజయ్ రౌత్ తనకు బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారని.. తనకిప్పుడు ముంబయి పాక్ ఆక్రమిత కశ్మీర్ లా కనిపిస్తుందన్నారు. ఇలా విమర్శలు.. ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ముంబయికి వస్తున్నా.. దమ్ముంటే అడ్డుకోండన్న మాట కంగనా నోటి వెంట ఎందుకు వచ్చిందన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
ఆమె భద్రతకు సంబంధించి మోడీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో వై ప్లస్ కేటగిరి సెక్యురిటీని ఆమెకు కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ కేటగిరి కింద.. ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతగా ఉండనున్నారు.
కంగన విషయంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం అనూహ్యంగా స్పందించారు. ఆమె హిమాచల్ కుమార్తె.. ఆమెకు ప్రాణాపాయం ఉండటంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతను ఏర్పాటు చేసిందని ఆ రాష్ట్రీ సీఎం జైరాంఠాకూర్ వ్యాఖ్యానించటం చూస్తే.. కంగన దమ్ము వెనుక ఎవరున్నది ఇట్టే అర్థమైపోతుంది. తనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించటంపై కంగన సైతం స్పందించారు. తనకు భద్రత ఏర్పాటు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కంగన ధన్యవాదాలు తెలిపారు.
జాతీయవాదుల స్వరాన్ని ఎలాంటి శక్తులు అణిచివేయలేవని చెప్పటానికి రుజువని.. తన ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణలోకి ఉంచుకొని తనను ముంబయి వెళ్లమన్న అమిత్ షాకు రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. చూస్తుంటే.. సేన సర్కారుకు చుక్కలు చూపించేందుకు వీలుగా కంగనను బీజేపీ ప్రయోగిస్తుందన్న భావన కలుగక మానదు. తిరిగి.. తిరిగి ఈ వ్యవహారం ఎక్కడవరకు వెళుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కంగనకు వై ప్లస్ భద్రత కల్పించిన కేంద్రం తీరు చూస్తే.. మహారాష్ట్ర సర్కారుకు మరో రఘురామ కృష్ణంరాజు మాదిరి కనిపించట్లేదు?