Begin typing your search above and press return to search.

గుండె పగిలిందన్న క్వీన్

By:  Tupaki Desk   |   13 April 2017 5:58 AM GMT
గుండె పగిలిందన్న క్వీన్
X
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చాలా స్ట్రాంగ్ అనే విషయం తెలిసిందే. ఈ భామ మాట్లాడే తీరు వింటేనే.. మానసికంగా కంగనా ఎంతటి శక్తివంతురాలు అనే విషయం తెలుస్తుంది. అలాంటిది ఒక ఫ్లాప్ సినిమాతో గుండె పగిలినంత పనయ్యిందని క్వీన్ చెప్పడం ఆశ్చర్యకరమే.

కంగనా రనౌత్ రీసెంట్ మూవీ రంగూన్.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 'ప్రేక్షకులకు నచ్చితే ఓ సినిమా హిట్ కావడాన్ని ఎవరూ ఆపలేరు. కొత్త దర్శకులతో కూడా చేశా కానీ.. రంగూన్ విషయంలో ఏదో మిస్ అయింది. అయితే.. ఈ మూవీలో నా కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ చూపానని క్రిటిక్స్ నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ మూవీ ఫ్లాప్ కావడంతో.. ఎక్కువ మంది చూసే అవకాశం దక్కలేదు. నా బెస్ట్ పెర్ఫామెన్స్ ను జనాలు చూడలేదనే ఆలోచనతో గుండె పగిలినంత పనయింది' అంటోంది కంగనా రనౌత్.

ఈ భామ మధుర్ భండార్కర్ తెరకెక్కించనున్న ఫ్యాషన్ సీక్వెల్ లో నటించేందుకు తిరస్కరించిందనే టాక్ ఉంది. 2008లో వచ్చిన ఫ్యాషన్ మూవీలో ప్రియాంకతో పాటు కంగనా కూడా నటించింది. అయితే.. ఈ రూమర్స్ ను కంగనా తిరస్కరించింది. 'మధుర్ భండార్కర్ తన ఇంటి గృహప్రవేశానికి పిలిచేందుకు చివరగా ఫోన్ చేశారంతే. ఆ తర్వాత ఎలాంటి పిలుపు అందుకోలేదు' అని చెప్పింది కంగనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/