Begin typing your search above and press return to search.
క్వీన్ సినిమాతో క్వీన్ డైరక్టరవుతోంది
By: Tupaki Desk | 6 March 2017 4:14 AM GMTబాలీవుడ్ బ్యూటీ.. బాక్సాఫీస్ క్వీన్ కంగనా రనౌత్ కు దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఏక్ నిరంజన్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ బ్యూటీ.. ఇప్పటికే బాలీవుడ్ సింహాసనం మీద తిష్ట వేసుకుని కూర్చుండిపోయింది. యాక్ట్రెస్ గా పోటీ భామలకు అందుకోలేని సవాళ్లను చాలా విసిరింది కంగనా.
ఇప్పుడీ క్వీన్ తన కొత్త అవతారం గురించి గుట్టు విప్పేసింది. ఈమెకు ఎప్పటి నుంచో డైరెక్టర్ అవాలనే కోరిక ఉండగా.. ఆ ప్రాజెక్టు సంగతి చెప్పింది కంగనా. తను ఓ బయోపిక్ ను డైరెక్ట్ చేస్తానని చెప్పడమే కాదు.. దాని డీటైల్స్ కూడా వెల్లడించింది. రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయ్ చరిత్రను సినిమాగా మలచబోతున్నట్లు చెప్పింది ఈ క్వీన్. రాణి లక్ష్మీబాయ్ వీరచరిత్రతో పాటు ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియచెప్పబోతున్నానని అంటోంది కంగనా. ఈ మూవీలో టైటిల్ రోల్ ను పోషించేది వేరేవరో కాదు.. స్వయంగా కంగనానే.
ఈ మూవీ స్క్రిప్ట్ కూడా దాదాపు తానే ప్రిపేర్ చేస్తానంటోందీ బాలీవుడ్ క్వీన్. అన్నట్లు.. న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పొందిన ట్రైన్డ్ స్క్రిప్ట్ రైటర్ కంగనా అనే విషయం తెలుసు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/