Begin typing your search above and press return to search.
ఝాన్సీ రాణి రక్త తర్పణం
By: Tupaki Desk | 8 Sep 2018 5:01 PM GMTహిస్టరీలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పై పాఠమే వేరు! ఝాన్సీ రాణి కత్తి చేతబట్టి లంఘించిన తీరు పైనా - శత్రు శిరచ్ఛేదనంలో విరోచితంగా పోరాడిన తీరుపైనా కథలెన్నో ఉన్నాయి. వాటిని చిన్నప్పుడు తెలుగు టెక్ట్స్ బుక్స్ లో పాఠ్యాంశంగా చదువుకున్న రోజులు గుర్తుకు రాకుండా ఉండవు. ఝాన్సీ లక్ష్మీభాయ్ ఒక బిడ్డ తల్లి. తన బిడ్డను వీపునకు కట్టుకుని యుద్ధరంగంలో కత్తి చేబట్టి శత్రువుకు ఎదురెళ్లిన తీరు కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ ఫోటోల్ని నాడు పాఠ్య పుస్తకాల్లో అచ్చేశారు కాబట్టి ఝాన్సీ రాణి అంటే ఇలా ఉండేదేమో! అని అనుకునేవారు విద్యార్థులు.
ఇప్పుడు ఆ పాఠం సినిమాగా తెరకెక్కుతోందన్న ఆలోచన ఆసక్తి పెంచుతోంది. రియల్ లైఫ్ లోనే క్వీన్ గా వెలిగిపోయిన కంగన ఝాన్సీ రాణిగా నటిస్తోంది అనగానే అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. యాప్ట్ పర్సనాలిటీనే ఈ సినిమాకి ఎంపిక చేసుకున్నారన్న ఆసక్తి కలిగింది. మణికర్ణిక టైటిల్ తో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. అయితే బ్యాలెన్స్ షూటింగ్ ని క్రిష్ బదులుగా కంగన స్వయంగా తెరకెక్కించడం ఇటీవల చర్చకొచ్చింది. క్రిష్ తో కంగన వివాదం గురించి - అభిప్రాయ విభేధాల గురించి ఆసక్తికర డిబేట్ నడిచింది.
అదంతా అటుంచితే లేటెస్టుగా కంగన కదనరంగంలో కదం తొక్కి శత్రువుల రక్తంతో స్నాన మాడిన ఫోటో ఒకటి అంతర్జాలంలో లీకై వేడి పెంచింది. ఒళ్లంతా రక్తపు మరకలతో.. ముఖం అంతా రక్తంతో తడిసిపోయింది. ఒక్కో మెడ తెగుతుంటే ఆ రక్తం చివ్వున చిమ్ముతూ ఝాన్సీరాణిపై పడుతుంటే.. ఆ సన్నివేశాన్ని ఓసారి ఊహించండి. అలాంటి భీకరమైన యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించారనే అర్థమవుతోంది. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ సీన్. క్వీన్ సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.