Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఓల్డ్ స్టైల్ లో చంపుతున్న క్వీన్

By:  Tupaki Desk   |   14 Aug 2019 9:35 AM GMT
ఫోటో స్టొరీ: ఓల్డ్ స్టైల్ లో చంపుతున్న క్వీన్
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అనగానే ఒక ప్రతిభావంతమైన నటి మాత్రమే కాదు.. చీటికిమాటికి ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ ఇతరులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ లేడీ అని కూడా మనసులో మెదులుతుంది. అయితే ఈ రచ్చలో అందరూ ఆమె గ్లామర్ సంగతి దాదాపుగా అందరూ మర్చిపోయారు. కంగనా న్యూస్ అంటే చాలు..ఏదో ఒక వివాదానికి సంబంధించినదే అని ఫిక్స్ అయిపోయారు.

కానీ అలా ఏం లేదు. కంగనా ఒక ఫ్యాషనిస్టా. ఫిలిం ఫెస్టివల్స్.. ఇతర అవార్డ్స్ ఈవెంట్స్ లో ఎంతో స్టైలిష్ గా దుస్తులు ధరించి చూపరుల మతిపోగొడుతుంది. కంగనాకు స్వయంగా ట్విట్టర్ ఖాతా.. ఇన్స్టా ఖాతాలు లేవు కానీ కంగనా తరఫున ఓ టీమ్ ఈ ఖాతాలను మెయింటెయిన్ చేస్తుంది. అలాంటి ఇన్స్టా ఖాతా ద్వారా తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు "రెట్రో క్వీన్ ఇన్ ది హౌస్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రెట్రో అంటే తెలుసు కదా పాత కాలం స్టైల్. అరవై డెబ్బైలలో హీరోయిన్ తరహాలో రెడీ అయిన కంగనా ఈ ఫోటో షూట్ కోసం సూపర్ పోజులిచ్చింది. పూల డిజైన్ ఉన్న బ్లాక్ కలర్ గౌన్లో హాట్ బ్యూటీలా దర్శనమిచ్చింది.. పక్కకు ఒత్తుగా దువ్విన పాతకాలం హెయిర్ స్టైల్.. మెడలో ముత్యాల నెక్లెస్ తో రెట్రో స్టైల్ ను గుర్తు తెచ్చింది. అంతా ఉంది కానీ హాటు షో లేకపోతే ఎలా? అందుకే డీప్ వీ నెక్ తో ఆ లోటు లోకుండా ఫోటో షూట్ కు స్పైసీనెస్ ను జోడించింది. ఈ ఫోటోలకు నెటిజన్లు తెగ లైక్స్ కొట్టారు లెండి.

కంగనా సినిమాల విషయానికి వస్తే అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వంలో 'పంగా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా దశరథ్ ఎం. మాలి దర్శకత్వంలో 'ధాకడ్' అనే మరో చిత్రంలో నటిస్తోంది. జయలలిత బయోపిక్ 'తలైవి' లో కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎఎల్ విజయ్.