Begin typing your search above and press return to search.
దేశద్రోహం కేసులో కంగనా రౌనత్.. విచారణ
By: Tupaki Desk | 8 Jan 2021 5:23 PM GMTవివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్యూలు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా సోదరులు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు.
తాజాగా తమపై ఉన్న కేసును కొట్టేసేలా ఆదేశాలను ఇవ్వాలని కంగన, రంగొలీలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాము సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, కేవలం తమ ఉద్దేశాలను మాత్రమే వెల్లడించామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అంతేగాక పోలీసుల సమన్లను తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
కంగన వాదనను విన్న హైకోర్టు ముంబై పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఇప్పుడే అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అదే విధంగా జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాల్సిందిగా కంగన, రంగోలీలను న్యాయస్థానం ఆదేశించింది
కోర్టు ఆదేశానుసారం.. దేశ ద్రోహం కేసులో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ముంబై పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. కంగనా వాంగ్మూలాన్ని బాంద్రా పోలీసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో విద్వేశాన్ని సృష్టించే పోస్టులు పెట్టారని కంగనా, ఆమె సోదరి రంగోలిపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు వారిపై కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా కంగనా పోలీస్ స్టేషన్ కు వచ్చి వాంగ్మూలాన్ని ఇచ్చింది.