Begin typing your search above and press return to search.
హృతిక్ పేరెత్తకుండా కౌంటరేసింది
By: Tupaki Desk | 4 July 2018 4:07 AM GMTహృతిక్ రోషన్ తో కంగనా రనౌత్ ప్రేమ గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల పాటు వీళ్లిద్దరూ సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారన్న ఊహాగానాలున్నాయి. ఈ విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతూ హృతిక్ మీద సంచలన ఆరోపణలు చేసింది కంగనా. అతను వాటిని తిప్పి కొట్టాడు. తన కొత్త సినిమా రిలీజవ్వబోతున్న ప్రతిసారీ ప్రమోషన్లలో భాగంగా హృతిక్ను టార్గెట్ చేయడం కంగనాకు అలవాటుగా మారింది. కొన్నేళ్లుగా ఈ గొడవ నడుస్తోంది. ఐతే గత ఏడాది ‘సిమ్రన్’ సినిమా విడుదలకు ముందు వివాదం బాగా ముదిరింది. హృతిక్ కూడా కంగనాకు కౌంటర్ గట్టిగా ఇవ్వడంతో ఆమె కొంచెం వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి సంయమనం పాటిస్తోంది.
ఐతే ఆమె మరోసారి హృతిక్ ను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఈసారి డైరెక్ట్ అటాక్ చేయలేదు. హృతిక్ పేరెత్తకుండా అతడితో ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తావించింది. తన జీవితంలో ప్రేమ.. పెళ్లి వ్యవహారాలపై కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను కావాలని కోరుకున్న ప్రతిదీ నాకు చెడు చేసేదే. పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నా. కానీ అది జరగకపోవడం సంతోషంగా ఉంది. ప్రేమ విఫలమైన కొన్నేళ్లకు నన్ను రక్షించావంటూ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నా. నా జీవితంలో ఎం జరిగిందో మీకు కూడా తెలుసుగా. నా జీవితంలో నాకు లభించిన దాంతో చాలా సంతోషంగా ఉన్నా’’ అని కంగనా అంది. అవకాశాల పరంగా తాను ఏది కావాలనుకున్నాదానికి అర్హురాల్ని కాదని అన్నారని.. మోడలింగ్ - సినిమాల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని.. వాటితో పాటు ప్రేమ కోసం కూడా తాను ఏడ్చానని.. దేవుడు నేను ఏది కోరుకుంటే అది ఇవ్వకుండా తన పట్ల చాలా దయతో వ్యవహరించాడని కంగనా అంది.