Begin typing your search above and press return to search.

ఝాన్సీ రాణికి మళ్లీ దెబ్బ

By:  Tupaki Desk   |   22 Nov 2017 5:07 PM GMT
ఝాన్సీ రాణికి మళ్లీ దెబ్బ
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మణికర్ణిక చిత్రాన్ని.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ పాత్రలో కంగన యాక్ట్ చేస్తుండగా.. ఈ సినిమా నిర్మాణంలో క్వీన్ కు గాయాలు కంటిన్యూ అవుతున్నాయి.

ప్రస్తుతం రాజస్థాన్ లోని జైపూర్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో యూనిట్ అంతా నిమగ్నమై ఉంది. మూవీ షూటింగ్ లో భాగంగా తన పెంపుడు కొడుకు పాత్రధారిని వీపున కట్టుకుని.. ఓ గోడపై నుంచి దూకే సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కంగనకు తీవ్ర గాయాలు అయ్యాయి. 40 అడుగుల గోడపై నుంచి కంగన దూకే సమయంలో.. పిల్లాడు జారిపోయాడట. దీంతో ఆ బాబును కాపాడేందుకు ప్రయత్నించింది ఈ హీరోయిన్. దీంతో ముందుగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్న ప్రదేశంలో కాకుండా.. కంగన పక్కకు పడిపోయింది.

అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో కంగన కాలికి ఫ్రాక్చర్ అయింది. ఈమెకు రెండు వారాల పాటు రెస్ట్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుతున్న సమయంలో.. కంగన నుదుటిపై కత్తిగాటు పడింది. యుద్ధ సన్నివేశాల కోసం ఎలాంటి డూప్ లను ఉపయోగించకుండా.. ఎన్ని గాయాలు అయినా సరే తనే ఆయా సీన్స్ ను పూర్తి చేయాలని పట్టుదలతో ఉందిట కంగనా రనౌత్.