Begin typing your search above and press return to search.
చరణ్ హీరోయిన్ గాలి తీసేసింది!
By: Tupaki Desk | 12 April 2019 4:33 AM GMTమణికర్ణికను కంటెంట్ తో సగం వివాదంతో సగం ఓ మాదిరిగా ఆడించుకున్న కంగనా రౌనత్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తనకు నచ్చని విషయాల గురించి వ్యక్తుల గురించి ఎంత దారుణమైన కామెంట్ చేయడానికైనా వెనుకాడని తత్వం వల్లే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కన్నా శత్రువులే ఎక్కువగా ఉన్నారు.
స్టార్ కిడ్స్ అన్నా నట వారసులు అన్నా ఒళ్ళంతా మిర్చీ కారం రాసుకున్నట్టు ఫీలయ్యే కంగనా ఇదే విషయం మీద గతంలో కరణ్ జోహార్-సైఫ్ అలీ ఖాన్-వరుణ్ ధావన్ లతో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ సరసన ఎంపికైన అలియా భట్ ని టార్గెట్ చేసింది. దానికో కారణం ఉంది
ఓ ప్రముఖ వెబ్ సైట్ ఈ ఏడాది బెస్ట్ పెరఫార్మెర్స్ గురించి ఆన్ లైన్ లో ఒక పోల్ పెట్టింది. అందులో కంగనాకు 37 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్ రాగా 33 శాతంతో తర్వాత స్థానంలో అలియా భట్ నిలిచింది. దీని గురించి ఓ మీడియా ప్రతినిధి అలియాను దాటారు కదా ఎలా అనిపిస్తోంది అని అడిగిన ప్రశ్నకు ఇంతెత్తున లేచింది. గల్లీ బాయ్ లాంటి సిల్లీ సినిమాలో నటించిన అలియాతో నన్ను పోల్చడం ఏమిటని వారసత్వపు కార్డుతో వచ్చిన వాళ్లకు నటన వస్తుందంటే నేను నమ్మనని వెక్కి వెక్కి ఏడిస్తే అది యాక్టింగ్ అయిపోదని గల్లీ బాయ్ లో ఓ సీన్ ని ఉదాహరణగా తీసుకుని చెప్పింది.
అయితే కంగనా మరి ఉడతా పంజాబ్-రాజీ లాంటి సినిమాలు చూసిందో లేదో లేక చూస్తే మనసు ఈగో రెండు ఒప్పుకోవని ఆగిపోయిందో చెప్పమంటూ అలియా ఫాన్స్ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇంకా అలియా రియాక్షన్ రావాల్సి ఉంది