Begin typing your search above and press return to search.

కంగన ఒక పిచ్చిది.. కేసు పెడతా

By:  Tupaki Desk   |   5 Sept 2017 3:18 PM IST
కంగన ఒక పిచ్చిది.. కేసు పెడతా
X
ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ స్టార్ హోదాను సంపాదించుకున్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్. హీరోయిన్ గానే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో అలరించింది. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను, అటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని తరచు ఆమె చెబుతూ ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇంతవరకు ఆమె కేరీర్ ను సక్సెస్ ఫుల్ గానే నెట్టుకొచ్చింది.

అయితే అప్పుడప్పుడు అమ్మడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరిని షాక్ కి గురి చేస్తూ ఉంటుంది. అదే తరహాలో.. కెరీర్ మొదట్లో కొందరు తనని ఇబ్బందికి గురి చేశారని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వారు ఎవరంటే.. హృతిక్ రోషన్ - అధ్యయన్ సుమన్ లని ముఖ్యంగా తను నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో నటుడు నిర్మాత అయిన ఆదిత్య పంచోలి తనను దాదాపు హౌస్ అరెస్ట్ చేశాడని చెప్పింది.

దీంతో బాలీవుడ్ మీడియా ఆమె కామెంట్స్ పై అనేక కథనాలను ప్రసారం చేసింది. విషయం తెలుసుకున్న ఆదిత్య ఆమె వ్యాఖ్యలను ఖండించారు. అంతే కాకుండా ఆమె ఒక పిచ్చిదని తనపై అనవసరంగా అబద్ధపు నిందలు మోపుతుందని చెబుతూ.. కంగన మాట్లాడిన విధానాన్ని తప్పు బట్టారు. ఇక బురదలో రాళ్లు విసిరితే మనమిదే పడుతుందని ఆమెపై కోర్టులో కేసు వేస్తానని చెప్పాడు.

ఇప్పటికే ఆమె హృతిక్ వేసిన కేసుపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు అదే తరహాలో ఆదిత్య కూడా తొడవుతుండడంతో ఇంకెన్ని ఇబ్బందులను ఎదుర్కుంటుందో చూడాలి.