Begin typing your search above and press return to search.
పాత పెళ్లాంతో కొత్త పెళ్లికి క్వీన్ సాయం
By: Tupaki Desk | 19 Jan 2018 5:06 AM GMTబాలీవుడ్ లో లవ్ స్టోరీలు- పెళ్లిళ్లు ఎంత సహజంగా జరిగిపోతూ ఉంటాయో.. బ్రేకప్ భాగోతాలుఓ కూడా అదే స్పీడ్ లో ఉంటాయి. అన్ని భాషల సినిమా రంగాల్లోనూ ఇవి కనిపించినా.. అగ్రశ్రేణి బాలీవుడ్ లో కాసింత ఎక్కువగా ఉంటాయి. స్టార్ హీరో హృతిక్ రోషన్.. తన భార్య సుసానే ఖాన్ కు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
అయితే.. ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏంటంటే.. హృతిక్ రోషన్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడట. అంత పెద్ద హీరో రెండో పెళ్లి చేసుకోవడం విచిత్రమేమీ కాదు కానీ.. ఈయన తను విడాకులు ఇచ్చిన సుసానే నే మళ్లీ మ్యారేజ్ చేసుకుంటాడన్నదే అసలు పాయింట్. ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని టాక్ వినిపిస్తోంది. నిజానికి వీరిద్దరూ సామరస్యపూర్వకంగానే పరస్పర అంగీకారంతోనే విడిపోయారు తప్ప.. ఒకరినొకరు ఏనాడూ ఒక్క మాట కూడా అనుకోలేదు. పైగా తన మాజీ భర్తకు అన్ని వేళలా సపోర్ట్ అందిస్తూ వచ్చింది సుసానే.
చివరకు హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ క్వీన్ మాటల దాడి చేసినపుడు కూడా.. తన ఎక్స్ హజ్బెండ్ నే సపోర్ట్ చేసింది సుసానే ఖాన్. ఆ ఎపిసోడ్ లో ఈ మాజీ వైఫ్ మాటల కారణంగానే.. హృతిక్ వైపు ఎక్కువమంది మొగ్గారు. ఓ రకంగా చూస్తే.. కంగనా ఎపిసోడ్ కారణంగా.. హృతిక్-సుసానేలు మళ్లీ మానసికంగా బాగా దగ్గరయ్యారని అంటారు. అదే బంధం ఇప్పుడు మళ్లీ పెళ్లి వరకూ దారి తీసిందట.