Begin typing your search above and press return to search.

స్టేజ్ మీద అతనికి ముద్దు పెట్టేసింది

By:  Tupaki Desk   |   18 Sep 2017 4:52 AM GMT
స్టేజ్ మీద అతనికి ముద్దు పెట్టేసింది
X
కంగన రనౌత్ ఎప్పుడూ అంతే. అందరిలా తాను అస్సలుండదు. ఏం మాట్లాడాలని అనుకుంటుందో అదే మాట్లాడుతుంది. ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. దానివల్ల ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అని కేర్ చేసినట్టే కనిపించదు. తనకు అన్యాయం చేశారంటూ బాలీవుడ్ లోని హృతిక్ రోషన్ - ఆదిత్య పంచోలి వంటి వాళ్లపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన డేరింగ్ ఆమెది. తనకు కోపమొస్తేనే కాదు.. అభిమానం వచ్చినా తట్టుకోవడం కష్టమేనని ఈమధ్యనే అందరికీ తెలిసింది.

కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన సిమ్రన్ ఇటీవలే థియేటర్లకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ టీవీ డ్యాన్స్ షోకు వచ్చింది. ఇందులో భాగంగా యాంకర్ రాఘవ్ జుయల్ ముందు కంగనాతో డ్యాన్స్ చేశాడు. తర్వాత ప్రోగ్రాంకు హోస్ట్ గా వచ్చిన కంగనా ను అభినందిస్తూ మాట్లాడాడు. ‘‘మహిళల సమస్యలపై మీరు చాలాసార్లు మాట్లాడారు. ఆడ-మగ సమానమేనని మాటలతో చెప్పడం కాకుండా రుజువు చేశారు. అసలు మీ పక్కన నిలబడగలడమే చాలా గొప్ప’’ అంటూ తన మాటల్తో కంగననాను ఆకాశానికి ఎత్తేశాడు. దీనికి కంగనా ఎంతగా మురిసిపోయిందంటే రాఘవ్ బుగ్గపై ముద్దు పెట్టేసింది. అనుకోని ఈ అదృష్టానికి రాఘవ్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

‘‘చాలామంది మగవాళ్లు తాము ఆడవాళ్లతో సమానమని అంగీకరించలేరు. కానీ నువ్వు అంగీకరించావు. దానికి చాలా సంతోషమేసింది’’ అంటూ కంగనా రాఘవ్ కు ముద్దు పెట్టాక చెప్పింది. సినిమా వాళ్లను టీవీవాళ్లు పొగుడుతూనే ఉంటారు. అందరూ థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటారు. కానీ కంగనా మాత్రం ఈ విషయంలోనూ చాలా డిఫరెంట్. యాంకర్ జీవితాంతం మరిచిపోలేని గిఫ్టిచ్చింది.