Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: నిప్పు కణికలా కంగన

By:  Tupaki Desk   |   1 Oct 2018 1:18 PM GMT
ఫోటో స్టొరీ: నిప్పు కణికలా కంగన
X
కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సి'. సినిమాకు సంబంధించిన అసలు అప్డేట్ల కంటే వివాదాలే ఎక్కువగా మీడియలో ఎక్కువగా నానడంతో అసలు ఈ సినిమా అనుకున్న సమయయానికి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. క్రిష్ తప్పుకున్న తర్వాత కంగన దర్శకత్వ భాద్యతలు చేపట్టి ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రేపు అక్టోబర్ 2 న మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా 'మణికర్ణిక' టీజర్ ను విడుదల చేస్తామని ఫిలిం మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక దానికి శాంపిల్ అన్నట్టుగా ఈరోజు సినిమాననుండి రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఒక పోస్టర్ లో కదనరంగంలో రెండు కత్తులు దూస్తూ శత్రువులపై రంకెలేస్తున్న అపరకాళికలా ఉంది కంగన. మరో పోస్టర్ లో మాత్రం రాజసం ఉట్టిపడేలా తలపాగా ఖడ్గం నడుముకు ధరించి ఝాన్సి రాణి లాగా నిలబడింది.

జీ స్టూడియోస్ - కమల్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25 న రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చగా క్రిష్ దర్శకుడు.