Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : రాజసం అదిరిందిగా

By:  Tupaki Desk   |   23 Feb 2018 7:03 AM GMT
ఫోటో స్టోరీ : రాజసం అదిరిందిగా
X
గౌతమీపుత్ర శాతకర్ణితో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు క్రిష్ బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ తో మణికర్ణిక తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో రూపొందుతున్న ఈ మూవీ సౌత్ లో అన్ని బాషల్లోను డబ్బింగ్ రూపంలో రాబోతోంది. ఇప్పటి దాకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయని యూనిట్ లీక్స్ రూపంలో అప్పుడప్పుడు కొన్ని సాంపిల్స్ వదులుతునే ఉంది. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్న సమయంలో కంగనా గాయాల పాలు కావడంతో కొంత జాప్యం జరిగింది కాని' లేకపోతే షూటింగ్ ప్రారంభం నాడు ప్రకటించిన ఏప్రిల్ లోనే ఇది విడుదలకు సిద్ధంగా ఉండేది. ఇందులో కంగనా లుక్ పై చాలా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం రాజస్తాన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మణికర్ణిక ఆన్ ది సెట్ ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అవుతోంది. అందులో కంగనా రౌనత్ మెరూన్ రెడ్ శారీలో ఖరీదైన నగలు ఒంటిపై దిగేసుకుని చాలా ఠీవిగా నడిచొస్తున్న స్టిల్ చూస్తుంటే సినిమాలో చాలా విషయమే ఉన్నట్టు కనిపిస్తోంది. బాహుబలి కథకులు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మణికర్ణిక కథను అందించారు. వాస్తవ గాధను ఆధారంగా చేసుకుని సినిమాటిక్ డ్రామాను దానికి జోడించి మంచి హిస్టారికల్ కమర్షియల్ మూవీగా దీన్ని రాసినట్టు టాక్. ప్రస్తుతం జైపూర్, బికనీర్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న మణికర్ణిక తెలుగు, తమిళ్ తో పాటు మలయాళంలో కూడా విడుదల అవుతుంది. రేస్ గుర్రం విలన్ రవి కిషన్ ఇందులో కీలక పాత్ర వహిస్తున్నాడు.

ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు విడుదల చేసే ఆలోచనలో ఉంది మణికర్ణిక యూనిట్. అదే రోజు అక్షయ్ కుమార్ గోల్డ్ ఇప్పటికే ప్రకటించారు కాబట్టి దీని గురించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రజనికాంత్ 2.0 కూడా అదే తేది మీద కన్నేసాడు కాని అది దీపావళికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మణికర్ణికగా కంగనా వీర రాజసాన్ని చూడాలంటే ఆగష్టు దాకా వెయిట్ చేయాల్సిందే.