Begin typing your search above and press return to search.

కంగనా ఫొటోస్ లీక్ చేశారా?

By:  Tupaki Desk   |   27 Oct 2017 6:03 PM GMT
కంగనా ఫొటోస్ లీక్ చేశారా?
X
ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్ గా ఉన్న కంగనా రనౌత్ ఎన్ని విమర్శలు వస్తోన్న తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఝాన్సీ రాణి జీవితం ఆధారంగా టాలీవుడ్ దర్శకుడు రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే సగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇన్ని రోజులు కంగనా కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేయలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మణికర్ణిక ఫొటోస్ లీక్ అయ్యాయని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. సినిమాలో కంగన పాత్రకు తగ్గట్టుగా చాలా సింపుల్ గా ఉంది.

జైపూర్ లో వేసిన ఒక సెట్ లో డైలాగ్స్ చెబుతూ కనిపించింది. అలాగే దర్శకుడు క్రిష్ కూడా ఆమెకు సహాయం చేస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలు ఎవరైనా లీక్ చేశారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మరో మూడు నెలల్లో క్రిష్ పూర్తి చేస్తాడట. ఎలాగైనా సమ్మర్ స్టార్టింగ్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.