Begin typing your search above and press return to search.
క్రిష్ పోయి పోయి అక్కడ ఇరుక్కున్నాడే..
By: Tupaki Desk | 30 May 2017 8:17 AM GMTవివాదాలకు దూరంగా సినిమాలు తీసే దర్శకుడు క్రిష్. ఈ సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. ‘కంచె’తో పాటు ‘శాతకర్ణి’ దర్శకుడిగా అతడి స్థాయిని ఎంతో పెంచాయి. తెలుగులో అతడితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద స్టార్లు రెడీగా ఉన్నారు. కానీ అతను మాత్రం బాలీవుడ్లో కంగనా కథానాయికగా ఝాన్సీ లక్ష్మీభాయి కథతో ‘మణికర్ణిక’ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు.
ఐతే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వివాదాల్లో నానుతోంది. ఝాన్సీ లక్ష్మీభాయి కథతో కంగన కథానాయికగా క్రిష్ కంటే ముందు కేతన్ మెహతా సినిమా చేయాలనుకున్నాడు. దీని గురించి ఇంతకుముందు అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ ఇంతలో క్రిష్ ఈ ప్రాజెక్టును చేపట్టాడు. తన స్క్రిప్టును కంగనా దొంగిలించి.. వేరే దర్శకుడితో ‘మణికర్ణిక’ చేస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాడు కేతన్.
ఇదిలా ఉంటే.. క్రిష్ ‘మణికర్ణిక’ కంటే ముందు మరో ఝాన్సీ లక్ష్మీభాయి సినిమా తెరకెక్కుతుండటం.. అదే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉండటం ఈ చిత్ర బృందాన్ని కలవర పెడుతోంది. బాలీవుడ్ నిర్మాత స్వాతి భిసే.. ఝాన్సీ లక్ష్మీభాయి కథతో గత ఏడాదే సినిమా మొదలుపెట్టింది. ‘మణికర్ణిక’ అనౌన్స్ చేశాక ఈ చిత్ర బృందం స్పీడు పెంచింది. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఈ ఏడాదే దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరి ముందే ఝాన్సీ లక్ష్మీభాయి కథతో సినిమా వచ్చేస్తే.. తర్వాత ‘మణికర్ణిక’ను ఎవరు చూస్తారన్నది సందేహం. ఇప్పటికే ‘గబ్బర్’ సినిమాతో బాలీవుడ్లో క్రిష్ కు ఒక చేదు అనుభవం ఉంది. మరి ‘మణికర్ణిక’ విషయంలోనూ అతడికి ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. తెలుగులో పెద్ద సినిమాలు చేసే అవకాశాల్ని వదులుకుని క్రిష్ అనవసరంగా బాలీవుడ్ కొరివితో తల గోక్కుంటున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్లో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/