Begin typing your search above and press return to search.

లాజిక్ లేని నాస్టీ స్టోరీస్‌- కంగ‌న‌

By:  Tupaki Desk   |   11 Sep 2018 4:54 PM GMT
లాజిక్ లేని నాస్టీ స్టోరీస్‌- కంగ‌న‌
X
గ‌త కొంత‌కాలంగా క్వీన్ కంగ‌న‌ ర‌నౌత్‌ పైనా - మ‌ణికర్ణిక‌ పైనా ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కంగ‌న‌తో ద‌ర్శ‌కుడు క్రిష్ గొడ‌వ ప‌డి వెళ్లిపోయాడ‌ని - ఆ త‌ర్వాత సోనూసూద్ సైతం ఆవిడ దాటిని త‌ట్టుకోలేక పారిపోయాడ‌ని - ఆ క్ర‌మంలోనే బ‌డ్జెట్‌ ని అడ్డ‌గోలుగా పెంచేయ‌డంతో నిర్మాత కూడా జంప్ అయ్యాడ‌ని.. ఏవేవో పుకార్లు షికారు చేశాయి.

అస‌లు ఇవ‌న్నీ నిజ‌మేనా? అని కంగ‌న‌నే ప్ర‌శ్నిస్తే షాకిచ్చే ఆన్స‌ర్ ఇచ్చింది. అవ‌న్నీ చెత్త పుకార్లు! అంటూ కొట్టి పారేసింది. మ‌ణిక‌ర్ణిక నిర్మాణ బాధ్య‌త‌లు చూస్తున్న జీ స్టూడియోస్ బిజినెస్ హెడ్ సుజ‌య్ కుట్టీ కొన్ని నెల‌ల క్రితం ఉద్యోగం మానేశారు. నా సినిమాని నిర్మిస్తోంది జీ స్టూడియోస్‌. ఆయ‌న కాదు. అస‌లు ఈ చెత్త స్టోరీస్‌ లో లాజిక్ అన్న‌దే లేదు`` అంటూ కొట్టి పారేసింది. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక‌కు సంబంధించి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌ ని తెర‌కెక్కిస్తున్నామ‌ని కంగ‌న తెలిపింది.

అయినా జీ స్టూడియోస్‌ కి ఉన్న నెట్‌ వ‌ర్క్ గురించి మీకు తెలీదా? వాళ్లు సినిమాని చాలా ఈజీగా అమ్మేయ‌గ‌ల‌రు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బోలెడ‌న్ని చానెళ్ల నెట్‌ వ‌ర్క్ ఉంది. వాళ్లు ఒక టెర్రిఫిక్ సినిమాని తీసి రిలీజ్ చేయాల‌నుకున్నారు. అందుకే రాజీకి రాకుండా సినిమా తీస్తున్నాం.. అని వివ‌ర‌ణ ఇచ్చింది. జీ స్టూడియోస్ ఇంట‌ర్న‌ల్‌ గా జ‌రిగే విష‌యాలు మాకేం తెలుస్తాయి? అంటూ అమాయ‌కంగా ఫేస్ పెట్టింది కంగ‌న‌. నిర్మాత సంగ‌తి స‌రే క్రిష్ సంగ‌తేంటో కంగ‌న వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉందింకా.