Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ పెద్దలే ప్లాన్ వేసి సుశాంత్ ని చంపేశారు: స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 15 Jun 2020 4:30 PM GMTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతి అటు సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను తీవ్రంగా కదిలించింది. మంచి నటుడు, మంచి సినిమాలు.. మంచి కెరీర్ ఉన్న హీరో సడన్‌గా సూసైడ్ అందరిలోనూ విషాదం నింపింది. అయితే స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్లను ఎదగనివ్వరని తేల్చి చెప్పింది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల వీడియోను పోస్ట్ చేసిన కంగనా.. బాలీవుడ్ లో పెత్తనం నడిపే పెద్దల పై విమర్శలు గుప్పించింది.
"సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది. కానీ అవార్డు రానివ్వకుండా చేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు.?" అంటూ ప్రశ్నించింది. అంతేగాక "జరిగింది అంతా బాలీవుడ్ బడాల ప్లానే. ఎవరు కొత్తగా వచ్చినా వెనక్కి లాగుతారు. బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్‌ను తొక్కేస్తారు. సుశాంత్‌ను డ్రగ్ బానిసగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరి సంజయ్ దత్ గురించి బాలీవుడ్ పెద్దలు ఎందుకు మాట్లాడరు.
ఒకానొక సమయంలో తన సినిమాలను చూడమని అభిమానులను విజ్ఞప్తి చేశాడు. తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. సినిమాలు ఆడకపోతే తనను ఇండస్ట్రీ బయటికి తోసేస్తారని వాపోయాడు" అని కంగనా రనౌత్ తెలిపారు. ఆఖరికి నాపైనా కూడా ఆరు కేసులు బనాయించారని కంగనా చెప్పింది. బాలీవుడ్ పెద్దలు పెట్టిన ఒత్తిడి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కంగనా మండిపడింది. కంగనా అభిప్రాయాలకు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. "ఒక మనిషి మీ మధ్య ఉన్నప్పుడు ఆదరించడం మానేసి.. దూరం పెట్టి.. చనిపోయిన తర్వాత అంతా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారా’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.