Begin typing your search above and press return to search.
యంగ్ హీరోయిన్ ని క్వీన్ బలి పెడుతోందా?
By: Tupaki Desk | 18 May 2022 4:29 AM GMTక్వీన్ కంగన రనౌత్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ధాకడ్ ఈనెల 20న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ఇప్పటికే బాలీవుడ్ మాఫియాని నటవారసుల్ని మీడియా వేదికలపై అదే పనిగా కెలుకుతోంది కంగన. ఇంతకుముందు కపిల్ శర్మ షోలో బాలీవుడ్ బింబోస్ అంటూ లైగర్ బ్యూటీ అనన్యా పాండే పై వ్యంగ్యంగా స్పందించింది.
అనన్య తరహాలోనే తన నాలుకతో ముక్కును తాకే విద్యను లైవ్ లో ప్రదర్శించింది. ఇలా చేసిన హీరోయిన్ బింబో అంటూ సెటైర్ వేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారంగా మారింది.
కంగన తన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తుందని ఇలా ఒక యువనటి జీవితంతో ఆడుకుంటోందని కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. కొందరు క్వీన్ కి మద్ధతునిస్తే మరికొందరు అనన్య పాండేకు మద్ధతుగా నిలుస్తున్నారు.
ధాకడ్ ఓన్లీ ఫర్ అడల్ట్
ఈరోజు కంగన ఢాకడ్ సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు కానీ పెద్దార్ రోడ్ లోని CBFC కార్యాలయానికి సమర్పించిన తుది డ్రాఫ్ట్ నుండి ఏదీ తొలగించలేదని సమాచారం.
ఈ కంగనా రనౌత్-అర్జున్ రాంపాల్ చిత్రంలో యాక్షన్ పుష్కలంగా ఉందని రక్తపాతానికి కొదవేమీ లేదనేది టాక్. అందుకే సెన్సార్ బృందాన్ని యు/ఎ రేటింగ్ ఇవ్వకుండా ప్రేరేపించిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మేకర్స్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగించకూడదనుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
ధాకడ్ నిర్మించిన సోహైల్ మక్లాయ్ ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించారు. ఎ- సర్టిఫికెట్ వచ్చినందుకు నేను నిరాశ చెందలేదు అని ఆయన అన్నారు. అవును మేము ధాకడ్ కోసం A సర్టిఫికేట్ పొందాము. సినిమాలో చాలా యాక్షన్ ఉంటుంది కాబట్టి నేను ఇది ముందే ఊహించాను అని తెలిపారు. ఢాకడ్ ఈ శుక్రవారం మే 20న విడుదల కానుంది.