Begin typing your search above and press return to search.

క్వీన్ తొలి ముద్దు అనుభ‌వం

By:  Tupaki Desk   |   29 Sep 2019 1:30 AM GMT
క్వీన్ తొలి ముద్దు అనుభ‌వం
X
బాలీవుడ్ లో ఎలాంటి హిపోక్ర‌సీ లేకుండా ఓపెన్ గా మాట్లాడే గ‌ట్స్ వున్న ఏకైక హీరోయిన్ కంగ‌న రనౌత్‌. తాజాగా త‌న టీనేజ్ లో ఎదురైన తొలి ముద్దు అనుభ‌వాల్ని పంచుకుంది. ఢిల్లీలో `ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019` పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కంగ‌న త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని.. త‌న తొలి ప్రేమ సీక్రెట్ ని బ‌య‌ట పెట్టేసింది. 17 ఏళ్ల వ‌య‌సులో ఓ పంజాబీ యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని అప్పుడ‌త‌ని వ‌య‌సు 28 అని.. త‌న‌ని తొలిసారి చూడ‌గానే డేట్ కు వెళ్లాల‌ని అనిపించింద‌ని చెప్పుకొచ్చింది.

అప్పుడు నేను చంఢీఘ‌ర్ లో వుండేదాన్ని. ఆ స‌మ‌యంలో నా స్నేహితురాలు డేటింగ్ లో వుంది. త‌న‌ని చూశాక నాకూ డేట్ కు వెళ్లాల‌ని పించింది. 28 ఏళ్ల ఓ పంజాబీ యువ‌కుడు చాలా క్యూట్ గా వుండేవాడు. న‌న్ను చూసి నువ్వింకా చిన్న పిల్ల‌వ‌ని చెబుతుండేవాడు. దానికి తోడు నాకు ల‌వ్‌.. డేటింగ్ అంటే కొత్త‌. నాకు నేను ఓ క‌న్ ఫ్యూజ‌న్ లో వున్న ప్రేమికురాలిగా నాకు నేనే అనుకునేదాన్ని. `నేనూ ఎదుగుతాను. నాకూ ఓ ఛాన్స్ ఇవ్వండ‌ని అత‌నికి మెసేజ్ లు పంపేదాన్ని. నా తొలి ముద్దు అనుభ‌వం కూడా చాలా దారుణంగా జ‌రిగింది. అత‌న్ని కిస్ చేయ‌డం కోసం ప్రాక్టీస్ కూడా చేశాను. ఫైన‌ల్ గా త‌ను కిస్ చేస్తున్న స‌మ‌యంలో ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడు `ముఖం కొంచెం క‌దిలించు` అన్నాడు... అని భ‌ల్లున న‌వ్వేసింది కంగ‌న‌. దిల్లీ మైండ్ రాక్స్ 2019 కార్య‌క్ర‌మంలో కంగ‌న చాలా విష‌యాలు మాట్లాడింది. ల‌వ్ - సెక్స్ - డిజైర్ అంటూ ర‌క‌ర‌కాల టాపిక్స్ పై అడిగిన‌ప్పుడు తొమ్మిదో క్లాస్ క్ర‌ష్ గురించి చెప్పిన కంగ‌న .. సెక్స్ చేయాలంటే చేసెయ్.. అభ్యంత‌రం ఏమిటి? అంటూ చాలా జోవియ‌ల్ గా మాట్లాడేసింది.

శ‌త్రువుపై తాట‌కిలా శివ‌తాండ‌వం ఆడ‌ట‌మే కాదు..కంగ‌న‌లో ఇలా ఫ‌న్నీ రొమాంటిక్ యాంగిల్ ఉంద‌ని తెలిసేస‌రికి అభిమానుల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. రాణీవారు ఏం చెప్పినా వింటుంటే చెవికి ఇంపుగానే ఉంటోంది మ‌రి. జ‌య‌ల‌లిత పాత్ర కోసం ప్రోస్థ‌టిక్స్ ఓవైపు.. యాక్ష‌ణ్ రాణీగా ఫ‌స్ట్ బ్లడ్ లాంటి సినిమాకి ఇంకోవైపు స‌న్నాహ‌కాల్లో ఉన్న ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు ఇలా జ్ఞాప‌కాల్లోకి వెళుతూ హీట్ పెంచేస్తోంది.