Begin typing your search above and press return to search.

పీసీ పెళ్లి .. క్వీన్ ఇచ్చిన షాక్‌

By:  Tupaki Desk   |   1 Aug 2018 5:30 AM GMT
పీసీ పెళ్లి .. క్వీన్ ఇచ్చిన షాక్‌
X

గ‌త కొంత‌కాలంగా ముంబై ఆకాశం ఎర్ర‌బారింది. చుక్క‌లు రంగు మారాయి! కార‌ణ‌మేంటో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అందాల ప్రియాంక చోప్రా అమెరిక‌న్ బోయ్‌ ఫ్రెండ్ నిక్ జోనాస్‌ ని పెళ్లాడుతోంది అన్న వార్త వెలువ‌డ‌డ‌మే దానికి కార‌ణం. నిక్‌తో చెట్టాప‌ట్టాల్ అంటూ ఊరూ వాడా షికారు చేస్తూ పీసీ చేస్తున్న విన్యాసాలు ప్ర‌పంచానికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. ఇక ఈ చెట్టాప‌ట్టాల్ ఇంకెంతో కాలం కుద‌ర‌దని తెలుస్తోంది. ఇక పెళ్లి బాజాకు టైమైంద‌నే చెబుతున్నారు. వాస్త‌వానికి న‌వంబ‌ర్‌లో పెళ్లి ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ అంత‌దూరం కూడా లేదు.

ఈ సెప్టెంబ‌ర్ 12న నిక్ జోనాస్ పుట్టిన‌రోజు వేళ అమెరికాలో ఈ జంట ఒక‌ట‌వ్వ‌నుంద‌నేది తాజా స‌మాచారం. అమెరికాలో పెళ్లి కాబ‌ట్టి బాలీవుడ్ సెల‌బ్రిటీలెవ‌రూ అక్క‌డ ఎటెండ్ అయ్యే అవ‌కాశం లేదు. అందుకే పీసీ ముంబైలో ఓ గ్రాండ్ పార్టీని ఎరేంజ్ చేసింద‌ని తెలుస్తోంది. పీసీ పుట్టిన‌రోజు వేళ నిక్ త‌న ప్రేయ‌సికి ప్రపోజ్ చేయ‌డ‌మే గాక‌ నిశ్చితార్థం రింగు కూడా తొడిగేశాడు. ఇప్పుడు ఏకంగా నిక్ బ‌ర్త్‌ డేకి పెళ్లాడేయ‌బోతున్నాడ‌ట‌. ఇదే విష‌యాన్ని నిన్న‌టిరోజున వోగ్ అవార్డుల వేడుక‌లో జ‌ర్న‌లిస్టులు క్వీన్ కంగ‌నను ప్ర‌శ్నిస్తే త‌న రియాక్ష‌న్ ఎలా ఉందో తెలుసా? సంథింగ్ స్పెష‌ల్ రియాక్ష‌న్ ఇది. ఇదిగో ఈ వీడియో వీక్షిస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.