Begin typing your search above and press return to search.

సెక్స్ కోసం తపించే కంగనా రనౌత్

By:  Tupaki Desk   |   6 Sep 2017 8:46 AM GMT
సెక్స్ కోసం తపించే కంగనా రనౌత్
X
గతంలో ఓసారి రణవీర్ సింగ్ ఓపెన్ గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను సెక్స్ లేకుండా ఉండలేనని చెప్పాడు. ఆ తరువాత మొన్నామధ్యన ఫుడ్ అండ్ సెక్స్ అనే ఆప్షన్లు ఇస్తే నీకేం కావాలి అంటే.. ఆకలి చంపుకోగలను కాని సెక్స్ మాత్రం కావాల్సిందే అంటూ సమంత కూడా కామెంట్ చేసింది. ఇప్పుడు ఇలాంటి స్టేట్ మెంట్ ఒకటి కంగనా రనౌత్ కూడా ఇవ్వబోతోంది. కాని రియల్ లైఫ్‌ లో కాదులే.

త్వరలోనే ''సిమ్రాన్'' అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది కంగనా రనౌత్. ఈ సినిమా గురించి ఆల్రెడీ తన వివాదాస్పద ప్రమోషన్లతో రచ్చ లేపుతున్న కంగన.. ఇప్పుడు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో కూడా చెబుతోంది. ఆల్రెడీ పాటలను చూస్తే.. ఏంటి కంగన చాలా ఓవర్ గా క్లీవేజ్ షోలు గట్రా చేసింది అనే సందేహం రాకమానదు. ఈ సినిమాలో అమ్మడు పెళ్ళయ్యి డైవర్స్ తీసుకున్నాక.. సెక్స్ కోసం పరితపించే ఒక మహిళగా నటించిందట. చాలామంది అబ్బాయిలను మార్చుతూ ఎప్పుడూ కొత్తకొత్తగా సెక్స్ ను ఎంజాయ్ చేయాలనుకునే పాత్రలో నటిస్తుందట.

గతంలో ఓసారి రివాల్వర్ రాణి సినిమాలో ఇదే తరహాలో సెక్స్ కోసం పిచ్చెక్కిపోయే పాత్రలో నటించింది కంగన. కాని ఆ సినిమా డిజాష్టర్ అయ్యింది. మనోళ్ళు అలాంటి ఎడల్ట్ సెన్స్ ఉన్న కంటెంట్ ను అంతగా ఒప్పుకోవట్లేదనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 15న వస్తున్న ''సిమ్రాన్'' తన సెక్స్ ఎడ్వెంచర్స్ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.