Begin typing your search above and press return to search.

సారీ చెప్ప‌వా? అంటూ కింగ్ ఖాన్ నే నిల‌దీసిన కంగ‌న‌!

By:  Tupaki Desk   |   12 Oct 2021 2:30 AM GMT
సారీ చెప్ప‌వా? అంటూ కింగ్ ఖాన్ నే నిల‌దీసిన కంగ‌న‌!
X
క్వీన్ కంగ‌న ర‌నౌత్.. బాలీవుడ్ స్టార్ హీరోలు అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను సైతం వ‌దిలిపెట్ట‌ని సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఖాన్ ల త్ర‌యంపైనా కంగ‌న విరుచుకుప‌డే తీరు విస్మ‌య‌ప‌రుస్తుంది. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూక్ వంతు. షారూక్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ సేవిస్తూ ఎన్.సి.బికి ప‌ట్టుబ‌డ‌డంతో ఇప్పుడు దానిపై కంగ‌న క‌త్తి దూసింది. ఖాన్ డాడీ సారీ చెప్ప‌డా? అంటూ నిల‌దీసింది.

కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి షారూఖ్ పై కంగ‌న‌ పరోక్షంగా మండిపడ్డారు. మాదకద్రవ్యాల కేసులో తన కుమారుడిని అరెస్ట్ చేసిన తర్వాత చైనీస్ స్టార్ జాకీ చాన్ ఎలా క్షమాపణలు చెప్పారో వివ‌రించిన కంగ‌న‌.. కొడుకుని రక్షించడానికి జాకీచాన్ నిరాకరించార‌ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫోటోలో జాకీ చాన్ అతని కుమారుడి కోల్లెజ్ ను ఆమె షేర్ చేసింది. ``అతని కొడుకును పోలీసులు తీసుకెళ్లారు. 2014 లో మాదకద్రవ్యాల కేసులో కుమారుడిని అరెస్టు చేసినప్పుడు జాకీ చాన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాడు! అతను కుమారుడి చర్యకు సిగ్గుపడుతున్నాను.. ఇది నా వైఫల్యం.. అతన్ని రక్షించేందుకు నేను జోక్యం చేసుకోను`` అని చెప్పాడు. ``దీని తరువాత అతని కుమారుడు 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. క్షమాపణ కూడా చెప్పాడు`` అంటూ ఆమె #JustSaying హ్యాష్ ట్యాగ్ తో జోడించింది.

ఆర్య‌న్ పై డ్ర‌గ్స్ కేసుపై కంగనా రనౌత్ తన వైఖరిని స్పష్టం చేసేందుకు ఏమాత్రం జంక‌లేదు. ఇంతకుముందు హృతిక్ రోషన్ బ‌రిలో దిగి ఆర్యన్ కు తన సంఘీభావం తెలియజేస్తూ ఒక నోట్ పోస్ట్ చేసిన తర్వాత ఆమె రంగంలోకి దిగి ఇలా పేర్కొంది. ``ఇప్పుడు మాఫియా పప్పు అందరు ఆర్యన్ ఖాన్ రక్షణ క‌ల్పించేందుకు ముందుకొస్తున్నారు ... వాళ్లు తప్పులు చేస్తున్నా కానీ వ‌దిలిపెట్టేయాలి .. ఇది అతనికి దృక్పథాన్ని చూపిస్తోందని నేను నమ్ముతున్నాను.. అతని చర్యల పర్యవసానాలను అతనికి తెలియజేయండి ... ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు వారి గురించి గాసిప్ చేయకపోవడం మంచిది కానీ వారు ఏ తప్పు చేయలేదని వారికి అనిపించడం నేరం... అంటూ ఘాటుగా హృతిక్ పై కౌంట‌ర్లు వేసింది క్వీన్.

ప్రస్తుతానికి ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ముంబై కోర్టు శుక్రవారం అతని అభ్యర్ధనను మెయింటెనబిలిటీ ప్రాతిపదికన తిరస్కరించింది. అక్టోబర్ 3 న క్రూయిజ్ షిప్ లో నిర్వహించిన దాడిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతడిని అరెస్టు చేసి నిర్బంధించింది.