Begin typing your search above and press return to search.
కంగనకే వింతగా అనిపించేలా విజయేంద్రుడు ఏదో చేశారు!
By: Tupaki Desk | 5 Sep 2021 11:30 PM GMTక్వీన్ కంగన నటించిన తొలి సౌత్ సినిమా తలైవి విడుదలకు సిద్ధమవుతోంది. అంతకుముందే నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు కంగన విచ్చేయడమే గాక.. ఈ వేదికపై తలైవి రచయిత విజయేంద్ర ప్రసాద్ ని పొగిడేసిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మారదు. కంగన తన కెరీర్ ఆద్యంతం రచయితలు దర్శకులతో ఘర్షణ పడిన సంగతిని ఎవరూ మరువలేదు. కొందరితో కోర్టు గొడవల వరకూ వెళ్లింది . మణికర్ణిక దర్శకరచయిత క్రిష్ తో తీవ్ర వివాదాన్ని ఎవరూ మర్చిపోలేదు. కానీ తలైవి వేదికపై విజయేంద్ర ప్రసాద్ ని రచయితగా ఆమె గౌరవించిన తీరు ప్రశంసించిన వైనం సర్వత్రా ఉత్కంఠను పెంచాయి. కంగనలోని మరో కోణం ఆశ్చర్యపరిచింది.
తలైవి ప్రీరిలీజ్ వేదికపై కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ``నాకు తమిళం గురించి కానీ ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోంది. కానీ సినిమా చూసినప్పుడు మీరే (విజయేంద్ర ప్రసాద్) రైట్ అనిపించింది`` అని ఆయనను ప్రశంసించారు. మా ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుందని కంగన అన్నారు.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ``మూడు సంవత్సరాల క్రితం విష్ణు గారు నన్ను కలిశారు. ఆయన ఎప్పుడూ సినిమానే ఆశగా శ్వాసగా ఉండేవారు. ఆయన ఈ సినిమా కోసం స్టోరీ రాయమని అడగ్గానే ఓకే అన్నా. కంగనాను ఈ సినిమాలో తీసుకోవాలని చెప్పాను. ఆ కథ చెప్పినప్పుడు వారు వేరే హీరోయిన్ ను అనుకున్నారు. కానీ నా మైండ్ లోకి కంగనా వచ్చింది. కానీ ఆ విషయాన్ని అడిగేందుకు ఆమెను అప్రోచ్ అయ్యే వారు ఎవరు? ఒకవేళ ఆమెకు కథ నచ్చక పోతే మనల్ని బతకనివ్వదు. ఆమెకు కథ నచ్చింది. నువ్ నీలానే ఉండు.. నీ లానే ప్రవర్తించు అని చెప్పా. అదే జయలలిత అని చెప్పాను. నువ్ ఎంతో ఎత్తుకు ఎదుగుతావ్ అది మాత్రం నాకు తెలుసు. జయలలితగా కంగనా అదరగొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమె టాప్ చైర్ లో ఉంటుందని ముందే చెప్పా. అదే జరుగుతుంది`` అని అన్నారు.