Begin typing your search above and press return to search.
హీరోయిన్ రెమ్యునరేషన్ 24 కోట్లా?
By: Tupaki Desk | 25 March 2019 4:20 AM GMTబాలీవుడ్ లో నటనా టాలెంట్ తో పాటు వివాదాలను సమానంగా నడిపిస్తూ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండే కంగనా రౌనత్ తమిళనాడు మాజీ సిఎం జయలలిత పాత్ర చేయబోతున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని హిందిలో జయగా తమిళ్ లో తలైవిగా టైటిల్ డిసైడ్ చేశారు. తెలుగు వెర్షన్ కు సంబంధించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి గాను కంగనా రౌనత్ కు 24 కోట్ల పారితోషికం చెల్లించబోతున్నట్టు చెన్నై మీడియా టాక్. ఇది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ జయలలిత కున్న క్రేజ్ కంగనా కున్న మార్కెట్ వల్ల ఇది వర్క్ అవుట్ చేసుకోగలిగే మొత్తమే అని నిర్మాతలు డిసైడ్ కావడంతో అంతా ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఒకరకంగా చెప్పాలంటే గ్లామర్ పాత్రలు చేయడం మానేసిన కంగనా రౌనత్ లాంటి హీరొయిన్ కు ఇంత భారీ లెక్క అంటే రికార్డుగా చెప్పుకోవచ్చు
ఇప్పటికీ తమిళ్ లో జయలలిత పేరు మీద మరో రెండు బయోపిక్స్ నిర్మాణంలో ఉన్నాయి. అవి ఏ స్టేజిలో ఉన్నాయో క్లారిటీ లేకుండానే ఇప్పుడీ కంగనా రౌనత్ ప్రాజెక్ట్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాని ఈ పారితోషికం విషయంలో నిర్మాతల వెర్షన్ వేరుగా ఉందట. కంగనాకు డిసైడ్ చేసిన మొత్తం 12 కోట్లే అని మిగలిన 12 కోట్లు బడ్జెట్ లో షేర్ ప్రాతిపాదికన విడుదల అయ్యాక ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారట.
సుమారు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న జయ బయోపిక్ లో సీనియర్ యాక్టర్స్ చాలానే ఉంటారట. ఇవి అధికారికంగా వచ్చిన వార్తలు కానప్పటికీ వీటి తాలుకు చర్చలు నిర్మాతలు కంగనా మధ్య సీరియస్ గానే జరుగుతున్నట్టు సమాచారం. మణికర్ణిక యావరేజ్ సక్సెస్ అయితేనే కంగనా రౌనత్ ఈ రేంజ్ లో రచ్చ చేస్తోంది ఒకవేళ అది ఏ ఇండస్ట్రీ హిట్టో అయ్యుంటే అమ్మడి డిమాండ్ ఇంకే లెవెల్ లో ఉండేదో.