Begin typing your search above and press return to search.
ఆ రాణికి 15 కోట్లు కావాలట
By: Tupaki Desk | 11 Dec 2016 1:30 AM GMTబాలీవుడ్ కి రాణి కంగనా రనౌత్. ఆ విషయంలో సందేహం ఏ మాత్రం అక్కర్లేదు. యాక్టింగ్ స్కిల్స్ లో అమ్మడిని మ్యాచ్ చేసే హీరోయిన్ లేదనే మాటను ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ మేకర్స్ కూడా ఒప్పుకుంటారు. తనకు తనే నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకోగల ధైర్యం ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్ కూడా కంగనానే. ఇప్పుడీ బ్యూటీ నిర్మాతలను నిలువునా వణికించేస్తోందట. రెమ్యూనరేషన్ డిమాండ్ చూసి భయపడిపోతున్నారట ప్రొడ్యూసర్స్.
క్వీన్.. తను వెడ్స్ మను రిటర్న్స్.. లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కంగనా రనౌత్ డిమాండ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. తనకు ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెబుతోందట కంగనా. దీంతో నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యేందుకు కూడా ఆలోచించాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికే కంగనతో చేసేందుకు ప్రతిపాదించిన 'రాణి లక్ష్మీ బాయ్' ప్రాజెక్ట్ అటకెక్కేసిందని కూడా చెప్పుకుంటున్నారు.
పద్మావతి మూవీ కోసం దీపికా పదుకొనేకు 13 కోట్ల పారితోషికం ఇవ్వడంతో.. అంతకు మించి తీసుకుంటేనే తను నెంబర్ వన్ అవుతుందనేది.. క్వీన్ కంగన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అయితే.. హృతిక్ రోషన్-అధ్యయన్ సుమన్ లతో వివాదాలున్నా ఆఫర్స్ ఇచ్చిన నిర్మాతలు.. పారితోషికం 15 కోట్లు అన్న దగ్గర మాత్రం పారిపోతున్నారని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.