Begin typing your search above and press return to search.

ముంబై వ‌దిలి వెళుతూ మ‌రో బాంబ్ పేల్చిన కంగ‌న‌

By:  Tupaki Desk   |   14 Sep 2020 4:30 AM GMT
ముంబై వ‌దిలి వెళుతూ మ‌రో బాంబ్ పేల్చిన కంగ‌న‌
X
మహారాష్ట్ర పాలక పార్టీ శివసేనపై ఫిరంగిలా విరుచుకుప‌డిన కంగ‌న ధీర‌త్వం గురించి సర్వ‌త్రా యూత్ లో చ‌ర్చ సాగుతోంది. నేటి ఉదయం ముంబై నుంచి కంగ‌న మ‌నాలీకి బయలుదేరింది. ఇక ముంబైని వ‌దిలేస్తూ మ‌రోసారి క్వీన్ త‌న‌దైన శైలిలో బాంబ్ విసిరి మ‌రీ వెళ్లింది. ఇంత‌కీ కంగ‌న ఏమ‌ని ఫైరైంది? అంటే... పీవోకే అని నేను అన్న‌దానికి స‌రిగ్గా సెట్ట‌య్యింది! అంటూ పంచ్ వేసింది ముంబై పై. ఇక్క‌డ అరాచ‌కాలు అచ్చంగా అలా ఉన్నాయ‌నే ఉద్ధేశాన్ని మ‌రోసారి కంగ‌న బ‌య‌ట‌పెట్టింది.

ఈ కొద్ది రోజులు నాపై నిరంతరం దాడులతో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి నా వ‌ర్కింగ్ ప్లేస్ ని నాశ‌నం చేసి తర్వాత నా ఇంటిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా చుట్టూ ప్రాణాంతక ఆయుధాలతో భద్రతను అప్రమత్తం చేయ‌డం వ‌ల్ల‌నే బ‌తికి ఉన్నా. POK వ్యాఖ్య‌ల‌కు త‌గ్గ‌ట్టే ఇక్క‌డ ఉంది అంతా`` అంటూ క్వీన్ విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు ట్వీట్ చేసింది.

హిమాచల్ ప్రదేశ్ లోని మ‌నాలీలో దిగాక కంగ‌న భద్రత గణనీయంగా తగ్గిందని ప్రజలు త‌న‌ను ఆనందంతో పలకరిస్తున్నారని ట్వీట్ చేసింది. ఈసారికి నేను రక్షించబడ్డానని అనిపిస్తుంది. ముంబైలో తల్లి స్పర్శను అనుభవించిన టైమ్ ఉంది. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తుంటే బ‌తికిపోయినంత అదృష్టవంతురాలిని. శివసేన సోనియా సేనగా మారిన క్షణం.. ముంబై పరిపాలన తీవ్రవాదంలా మారింది`` అంటూ పోస్ట్ చేసింది. సేనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని క్వీన్ తిట్టేసింది.

ప్ర‌స్తుతానికి క్వీన్ ఇంటిని కూల్చే ప‌ని.. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు ఆగిపోయింది. ఇప్ప‌టికే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేని క‌లిసిన కంగ‌న ఆయ‌న‌తో సమావేశమై కార‌ణం లేకుండానే కూల్చివేతపై చర్యలు తీసుకోవాల‌ని అలానే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ విధిలాల నుంచే నేను ఆఫీస్ ప‌ని చేస్తాన‌ని కంగ‌న శ‌ప‌థం చేసిన సంగ‌తి తెలిసిందే. ముంబై మ‌రో పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే) అని నోరు జారిన ఫ‌లిత‌మిది.