Begin typing your search above and press return to search.
వీడియో : ప్రెస్ మీట్ లో వేరే హీరోయిన్ పేరు చెప్పగానే మండిపడ్డ కంగనా
By: Tupaki Desk | 4 Feb 2022 1:48 PM GMTఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో ఫైర్ అయ్యి ఫైర్ తో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమెకు తల పొగరు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. మరి కొందరు ఆమెను మరో రకంగా విమర్శిస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా తన పద్దతి తాను ఫాలో అవుతాను అన్నట్లుగా ఎదురుగా ఎవరు ఉన్నా ఒకే తరహాలో మాట్లాడేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ మరో హీరోయిన్ గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలకు కంగనా సమాధానం మరింతగా చర్చకు తెర తీసింది. జర్నలిస్ట్ ప్రశ్నకు కంగనా సీరియస్ అయిన విధానం కొందరికి కోపంను తెప్పించింది. ప్రశ్నకు సమాధానం చెప్పే ఆసక్తి లేకుంటే వదిలేయవచ్చు. కాని జర్నలిస్ట్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఏంటీ అంటూ కంగనా పై ఒక వర్గం బాలీవుడ్ జర్నలిస్ట్ లు కోప్పడుతున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే మీడియా సమావేశంలో ఉన్న కంగనా రనౌత్ ను జర్నలిస్ట్ లు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ సమయంలో ‘గెహ్రాయాన్’ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ దీపికా డ్రెస్సింగ్ గురించి విమర్శలు వచ్చాయి కదా ఆ విషయమై మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు వెంటనే సీరియస్ గా కంగనా స్పందిస్తూ... తమను తాము రంక్షించుకోలేని వాళ్ల కోసం.. తమ గురించి తాము డిఫైన్ చేసుకోలేని వాళ్ల కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఆమెను ఎవరైనా విమర్శిస్తే ఆమెకు ఏం చేయాలో తెలుసు. కనుక ఆ విషయంలో నేను స్పందించాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆమె సినిమా పేరును ఇక్కడ ప్రస్థావించి సినిమాను పబ్లిసిటీ చేయాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె సినిమా పీఆర్ టీమ్ మిమ్ములను ముంచేస్తారు.. ఆ సినిమా ను ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో మీరు అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్పి ఆ సినిమా ను మరింతగా ప్రమోట్ చేయాలని భావించడం లేదు అంటూ వ్యాఖ్యలు చేసింది. అందుకు జర్నలిస్ట్ స్పందిస్తూ తాను ఆ సినిమా ను ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో అస్సలు అడగలేదు అన్నాడు. నేను చాలా సాదారణంగానే ఆ ప్రశ్న అడిగాను అంటూ జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కంగనా రనౌత్ ఆ జర్నలిస్ట్ పై మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు.. ఆయనకు చాలా సీరియస్ గా సమాధానం చెప్పిన తీరు ప్రస్తుతం ఇతర జర్నలిస్ట్ లకు నచ్చడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగనా వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు ఒక లుక్కేయండి.