Begin typing your search above and press return to search.
ఈ విషయంలోనూ నేనే నెం.1... ఎప్పుడు వాళ్ల మీద ఏడుపేనా కంగనా?
By: Tupaki Desk | 6 April 2022 3:30 AM GMTకంగనా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. ఆమె తాను మాట్లాడాలి అనుకున్న మాటలను నిర్మొహమాటంగా మాట్లాడేస్తూ ఉంటుంది. ఆమె చేసే ప్రతి ఒక్క వ్యాఖ్య కూడా చాలా పదునుగా ఉండి ఎంతో మంది మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కొందరు బాధ పడ్డా కూడా ఎక్కువ మంది అభిమానిస్తారు. కాని కొన్ని సార్లు ఆమె పదే పదే సొంతంగా డబ్బ కొట్టుకుంటూ ఉంది.
తనను తాను ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ గా చెప్పుకుంటూ ఉంటుంది. నటన విషయంలో తనను మించిన వాళ్లు లేరు అంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. నటన విషయంలో తనను మించిన వారు లేరు అనడంలో సందేహం లేదు కాని.. ఇతరులు మొత్తం కూడా తన తర్వాతే అంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం తప్పు అంటూ స్వయంగా అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కంగనా రనౌత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.. ఇతర స్టార్స్ కు ఎవరికి సాధ్యం కాని ఘనతలు ఆమె దక్కించుకుంది. కాని ఆ విషయాన్ని ఇతరులు చెబితే బాగుంటుంది. కాని ఆమె తనకు తాను చెప్పుకోవడం ఎబెట్టుగా ఉంటుంది. తాజాగా లాకప్ అనే ఒక షో కు కంగనా మొదటి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఆ షో మంచి పాపులారిటీని దక్కించుకుంది.
తన లాకప్ షో గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ హోస్టింగ్ చేశారు కాని వారందరు కూడా ఆకట్టుకోలేక పోయారు. అమితాబచ్చన్.. సల్మాన్ ఖాన్ ల తర్వాత తాను మాత్రమే ఆ స్థాయిలో హోస్టింగ్ చేశాను అని... హోస్ట్ గా అంతటి విజయాన్ని తాను మాత్రమే దక్కించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఎంతో మంది హోస్టింగ్ చేసినా కూడా వారికి సక్సెస్ దక్కలేదు అంటూ కంగనా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.
సినిమాల్లోనే కాకుండా ఇలా టాక్ షో ల విషయంలో కూడా ఖచ్చితంగా కంగనా సక్సెస్ అయ్యారు. ఆమె ఎంతో మంది సెలబ్రెటీల జీవితాల్లోని చీకటి కోణాలను జనాల ముందుకు తీసుకు వచ్చారు. షో సక్సెస్ విషయంలో కంగనా ఇన్వాల్వ్‌మెంట్ ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. అలా అని పదే పదే తాను సూపర్ హిట్ అనుకోవడం.. ఇతరులపై ప్రతి సందర్బంలో కూడా ఈ సందర్బంగా కూడా ఏడుపు ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
కంగనా అంటే అభిమానం ఉన్న వారు కూడా ఆమె తనకు తాను గొప్పలు చెప్పుకోవడంను జీర్ణించుకోలేక పోతున్నారు. సొంతం తమను తాము పొగుడుకుంటే ఖచ్చితంగా అది అతి అవుతుంది. కనుక కంగనా విషయంలో అభిమానులు కూడా అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.