Begin typing your search above and press return to search.

వాళ్ల డ‌ర్టీ ఎఫైర్‌ ను కెలికిన రిప‌బ్లిక్‌ టీవీ

By:  Tupaki Desk   |   3 Oct 2017 7:57 AM GMT
వాళ్ల డ‌ర్టీ ఎఫైర్‌ ను కెలికిన రిప‌బ్లిక్‌ టీవీ
X
వార్త‌ను వార్త‌గా ప్రసారం చేసే రోజులు పాత‌బ‌డిపోయాయి. సామాజిక ప్ర‌యోజ‌నం క‌లుగుతున్న అంశాల మీద చ‌ర్చ‌లు జ‌రిపి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌ని చేయ‌టం టీవీ ఛాన‌ళ్ల ప‌రిధిలా ఉండేది. కానీ.. ఇప్పుడ‌దంతా మారిపోయింది. సంచ‌ల‌నాలే కేరాఫ్ అడ్ర‌స్ లు అయ్యాయి. అంద‌రిని ఆక‌ట్టుకునే అంశాల మీద దృష్టి పెట్ట‌టం.. త‌మ క‌థ‌నాల‌తో స‌రికొత్త వివాదాలుగా తెర మీద‌కు తీసుకు రావ‌టం రిప‌బ్లిక‌న్ టీవీకి ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది,

నిత్యం ఏదో ఒక కొత్త అంశంతో తెర మీద‌కు రావ‌టం ఎల‌క్ట్రానిక్ మీడియాలో మామూలే అయినా.. రిప‌బ్లిక్‌ టీవీ ఎంట్రీతో జాతీయ‌స్థాయిలో నిత్యం ఏదో ఒక బ‌ర్నింగ్ ఇష్యూను తెర మీద‌కు తీసుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్లల‌లో ఒక‌డైన‌ హృతిక్ రోష‌న్‌.. అత‌డితో లింకు ఉంద‌ని చెబుతూ ఆ మ‌ధ్య‌న ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన క్వీన్ కంగ‌నా రౌన‌త్ ల ఇష్యూను రిప‌బ్లిక్ ఛాన‌ల్ మ‌ళ్లీ తీసుకొచ్చి కెలికింది. గ‌త ఏడాది ఏప్రిల్ లో హృతిక్ లాయ‌ర్ మ‌హేశ్ జ‌ఠ్మ‌లానీ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదును బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. ఇందులో కంగ‌న‌పై హృతిక్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌ను వెంటాడి.. వేధించింద‌ని.. నిత్యం త‌న వెంట కంగ‌నా ప‌డేద‌ని హృతిక్ త‌న ఫిర్యాదులో పేర్కొన్న విష‌యాన్ని రిప‌బ్లిక్ టీవీ ఇప్పుడు బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు లైంగిక‌ప‌ర‌మైన ఈమొయిల్స్ పంపేద‌ని.. త‌న‌ను ఆమె శాశ్విత ప్రేమికుడిగా అభివ‌ర్ణించేద‌ని పేర్కొన్నాడు. తామిద్ద‌రం 2009లో కైట్స్ మూవీ టైంలో క‌లిశాన‌ని.. అంత‌కు ముందు ఆమెతో ప‌రిచ‌యం లేద‌న్నాడు.

2009.. 2013ల‌లో వృత్తిప‌ర‌మైన కార‌ణాల కార‌ణంగానే కంగ‌న‌ను తాను ప‌లుమార్లు క‌లిశాన‌ని.. కానీ 2014లో త‌న‌ను దూషిస్తూ అస‌భ్య‌మైన మెసేజ్ లు త‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా హృతిక్ పేర్కొన్నారు. అంతేకాదు.. కంగ‌న‌ను మాన‌సికంగానూ.. శారీర‌కంగానూ తాను రేప్ చేసిన‌ట్లుగా ఆమె సోద‌రి రంగోళీ నుంచి మొయిల్ వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. హృతిక్‌ ను ఉద్దేశించి కంగ‌న సిల్లీ ఎక్స్ అంటూ అభివ‌ర్ణించ‌టం ఇద్ద‌రి మ‌ధ్య‌న గొడ‌వ‌కు కార‌ణ‌మైంది. చివ‌రికి ఈ ఇష్యూ కోర్టు వ‌ర‌కూ చేరింది.

హృతిక్ ఫిర్యాదు పాత‌దేన‌ని.. టీఆర్పీ రేటింగ్ కోస‌మే రిప‌బ్లిక్ టీవీ ఆ ఫిర్యాదును బ‌య‌ట‌కు తీసింద‌ని కంగ‌న త‌ర‌ఫు లాయ‌ర్ రిజ్వాన్ సిద్ధిఖీ విమ‌ర్శించారు. కంగ‌న ఆ వివాదాన్ని అధిగ‌మించి ముందుకు వెళ్లింద‌ని ఆమె సోద‌రి రంగోళీ ట్వీట్ చేయ‌ట‌మే కాదు.. స్టాక‌ర్ అంకుల్ ఇప్ప‌టికైనా త‌న భార్య‌పిల్ల‌ల మీద ఫోక‌స్ చేయాల‌ని చుర‌క‌లు అంటించింది. పాత్రికేయ ప్ర‌మాణాల మీద నిత్యం సందేశాలిచ్చే రిప‌బ్లిక్ టీవీ ఈ డ‌ర్టీ ముచ్చ‌ట‌ను హైలెట్ చేయాల‌ని అనుకోవ‌టం ఏమిటో ఖ‌ర్మ‌.?