Begin typing your search above and press return to search.

కంగన సెక్స్ లో అరుపులు తగ్గించండి

By:  Tupaki Desk   |   15 Sep 2017 1:29 PM GMT
కంగన సెక్స్ లో అరుపులు తగ్గించండి
X
చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఎదగడానికి లక్ తో పాటు మనిషికి కాస్త ఓపిక కూడా ఉండాలి. కెరీర్ లో చీకటిలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా.. వెలుగు అనే గమ్యం ఒక్కటే కనిపించాలి. ఆ చీకట్లో అవమానమనే రాళ్ళూ తగిలి కిందపడవచ్చు. కానీ పోరాడామనే ఆశ ఒక్కటి మనసులో గట్టిగా ఉంటే చీకట్లో ఉన్నా.. సరే ఆకాశాన ఉన్న తారల్లాగా ఎప్పటికి మెరుస్తారు. అదే తరహాలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న కంగనా రనౌత్ ఇప్పుడు మళ్లీ అలాంటి ఆటంకాలను ఎదుర్కొంటోంది.

సినిమా పరిశ్రమలోకి వచ్చేముందు తనను ఎంతో మంది వాడుకున్నారని చెప్పిన ఈ భామ కొంతమందిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది ఆమెపై పగపడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో అమ్మడు ఇప్పుడు ఏ స్టార్ట్ హీరో లేకున్నా లేడి ఓరియెంటెడ్ సినిమాలను తీసి మంచి విజయాలను అందుకుంటోంది. ఈ రోజు రిలీజ్ చేసిన సిమ్రాన్ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడిందని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని శృంగార సన్నివేశాల్లో ఎవ్వరు నటించని విధంగా పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ.. నిజమైన హావభావాలను చూపించిందంట.

ఆ సీన్స్ చూస్తే ఎంతటివారైనా కంగనా కి దాసోహం అవ్వాల్సిందే అని సినిమా యూనిట్ సభ్యులు అనుకున్నారట. కానీ ఆ సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు కట్ చేయమని చెప్పారట. ఎందుకంటే.. అసలు అక్కడ నిజమైన శృంగారం జరుగుతుందా అనే విధంగా కంగనా అరవడం మరి టూ మచ్ గా ఉన్నాయని.. ఆమె సెక్స్ సీన్లలో అరుపులు అంతగా వద్దంటూ సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో కట్ చేయలేక తప్పలేదట. ఒకప్పుడు సినిమాల్లో రేప్ సీన్స్ వస్తే తప్ప లౌడ్ సౌండ్ ను పెట్టేవారు కాదు. కానీ సిమ్రాన్ లో స్పెషల్ గా ఉండడానికి కంగనా చేత సెక్సీ సీనుకు కూడా డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. కానీ ఫైనల్ గా సెన్సార్ నో చెప్పడంతో ఈరోజు రిలీజైన సిమ్రాన్ లో సీన్లు ఎగిరిపోయాయ్.