Begin typing your search above and press return to search.

కంగన మళ్లీ బాంబులు పేల్చింది..

By:  Tupaki Desk   |   23 Feb 2017 11:05 AM GMT
కంగన మళ్లీ బాంబులు పేల్చింది..
X
కొందరు మాట్లాడితే సెన్సేషనల్ అనిపించే కొన్ని మాటలు.. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ మాట్లాడుతుంటే చాలా మామూలుగా అనిపిస్తాయి. ఆమె ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది మరి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమెకు అలవాటు. ఎంతటివారినైనా తన మాటలతో దులిపేస్తుంది రింగు జుత్తు సుందరి. తాజాగా మరోసారి ఆమె హాట్ కామెంట్స్ చేసింది.

‘‘సినిమాల్లో ఛాన్సుల కోసం నేనూ ఎక్స్‌ పోజింగ్‌ చేయాల్సి వచ్చింది.. ఇప్పుడూ చేస్తున్నాను.. ఇకపైనా చేస్తాను.. హీరోయిన్‌ అన్నాక అన్నీ చేయాలి.. అదంతా నటనలో భాగమే. గ్లామరస్‌ గా కన్పిస్తున్నాం కదా అని చిన్న చూపు చూస్తే మాత్రం కుదరదు.. ఈ విషయంలో చాలామందితో నేను గొడవ పడ్డాను’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించింది కంగనా.

మలయాళ నటి భావనపై లైంగిక దాడికి సంబంధింది అందరిలాగా ఆవేశపడిపోలేదు కంగనా. ‘‘మలయాళంలో ఓ కథానాయికను కిడ్నాప్‌ చేశారు. ఆమెపై లైంగిక దాడి యత్నం జరిగింది. అది బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. బాలీవుడ్‌లో అయినా.. ఇంకే ఇండస్ట్రీలో అయినా ఇలాంటి మామూలే. నాకూ అలాంటి వేధింపులు ఎదురయ్యాను. నేను వాటి గురించి ధైర్యంగా బయటికి చెప్పాను’’ అని కంగనా స్పష్టం చేసింది.

మొదట్నుంచి తాను ఇంతే అని.. ఏం మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతానని.. నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తానని.. ఎవరేమనుకున్నా తన తీరు మారదని కంగన స్పష్టం చేసింది. మోడలింగ్.. సినిమాల్లో రకరకాల పరిస్థితుల్ని ఎదుర్కొని రాటుదేలడం వల్లే తాను ఇలా మాట్లాడగలుగుతున్నానని కంగన అంది. సౌత్ సినిమాల్లో ‘ఏక్ నిరంజన్’ తర్వాత కనిపించకపోవడంపై స్పందిస్తూ.. తాను అక్కడికి నేటివిటీకి సరిపోనేమో అని నిర్మొహమాటంగా కంగన వ్యాఖ్యానించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/