Begin typing your search above and press return to search.
మహేష్ హీరోయిన్ ను ఏకి పారేసిన కంగన సిస్టర్
By: Tupaki Desk | 27 May 2019 3:25 PM GMTటాలీవుడ్ లో 'భరత్ అనే నేను'.. 'వినయ విధేయ రామ' చిత్రాలను చేసిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అయిన కబీర్ సింగ్ లో ఈమె నటించిన విషయం తెల్సిందే. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈమె 'ఇందూ కీ జవానీ' అనే చిత్రంలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది. ఇందూ కీ జవానీ సినిమా గురించి సోషల్ మీడియా ద్వారా కియారీ అద్వానీ ప్రకటించింది.
ఈ చిత్రం కాస్త బోల్డ్ కంటెంట్ తో రూపొందబోతుందట. డేటింగ్ యాప్స్ లో అబ్బాయిలను పరిచయం చేసుకుని వారితో డేట్ చేసే పాత్రలో కియారా కనిపించబోతుంది. అలా చేస్తున్న సమయంలో ఆమె ఎదుర్కొనే సమస్యలు ఏంటీ అనేది సినిమా కథాంశమట. ఈ కథాంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే కంగనా సోదరి రంగోలీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాపై ఆమె విమర్శలు చేసింది.
ఈమద్య కాలంలో బాలీవుడ్ సెలబ్రెటీలపై హీరోయిన్స్ పై సోదరి కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది రంగోలీ. ఈమె వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈమె 'ఇందూ కీ జవానీ' చిత్రంపై విరుచుకు పడింది. ఒక వైపు మహిళ సాధికారత కోసం ఉద్యమం సాగుతున్న సమయంలో ఇలాంటి టైటిల్ తో సినిమాలు ఎవరైనా తీస్తారా.. మహిళను ఆట బొమ్మలా చూపించే ఇలాంటి సినిమాలను తీయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆడవారిని అవమానించినట్లే అంటూ ట్వీట్ చేసింది. రంగోలీ వ్యాఖ్యలపై ఇందూ కీ జవానీ సినిమా యూనిట్ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.