Begin typing your search above and press return to search.
క్రిష్ పై వాట్సాప్ దాడి
By: Tupaki Desk | 30 Jan 2019 11:01 AM GMTబాక్స్ ఆఫీస్ దగ్గర మణికర్ణిక పెర్ఫార్మన్స్ ఎలా ఉందనే సంగతి కాసేపు పక్కన పెడితే బయట మాత్రం వివాదాలతో అంతకంత వేడిని పెంచుతోంది. క్రిష్ చేసిన ఆరోపణలు జాతీయ మీడియాలో సైతం సెగలు పుట్టించాయి. ఇప్పుడు రెండు వర్గాల వైపు మద్దతు వ్యతిరేకత వస్తోంది. కంగనా వ్యవహార శైలి గురించి బాగా తెలిసిన వాళ్ళు క్రిష్ వైపు నిలుస్తుండగా ఇష్యూ గురించి అవగాహన లేని బ్యాచ్ హీరొయిన్ కు సపోర్ట్ గా ట్విట్టర్ లో బయలుదేరింది.
తాజాగా కంగనా సోదరి రంగోలి ఇదో ఆధారం అంటూ ఓ వాట్స్ అప్ ఛాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో క్రిష్ ని కంగనా డిసెంబర్ 6న స్క్రీనింగ్ కోసం రమ్మని ఆహ్వానించినట్టు దాని కన్నా ముందు నిర్మాతలైన జీ స్టూడియోస్ కమల్ జైన్ లతో జరిగిన వ్యవహారాలు వివరించినట్టు చాంతాడంత మెసేజులు అందులో ఉన్నాయి. 20 కోట్లకు పైగా అదనపు పెట్టుబడి పెట్టి రీ షూట్ చేసేందుకు నిర్మాతలు ఒత్తిడి చేసారని స్క్రిప్ట్ లో మార్పులు కూడా రచయితలు చేసినవి తప్ప తనవి కావని అందులో పేర్కొన్నట్టు ఉంది.
అయితే రంగోలి షేర్ చేసిన ఈ స్క్రీన్ షాట్స్ లో క్రిష్ ఇచ్చిన బదులు కాని లేదా అతను ఇవి చదివాడు అనే చెప్పేందుకు సాధారణంగా మెసేజుల కింద ఉండే డబుల్ టిక్ కాని హై లైట్ చేయలేదు. ఒకవేళ క్రిష్ ఇచ్చిన సమాధానం కనక హార్ష్ గా ఉంటే ఇప్పుడు అది ఖచ్చితంగా కంగనా సిస్టర్స్ కే హెల్ప్ అయ్యేది. కాని అందులో అలా లేదు. కేవలం కంగనా నుంచి వెళ్ళిన మెసేజులు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ క్రిష్ వీటికి స్పందించి తాను ఏం బదులిచ్చాడో చూపుతాడేమో వెయిట్ చేసి చూడాలి. అయితే రంగోలి పెట్టిన పోస్టును గుడ్డిగా నమ్మడానికి లేదు. చేయని ఛాట్ ని ఇతరుల నెంబర్ ని మనం టార్గెట్ చేసిన వాళ్ళ పేరుతో ఈజీగా సేవ్ చేసుకుని ఇలాంటివి పుట్టించవచ్చు. కాని ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే క్రిష్ కూడా స్పందించాలి. అప్పుడు కాని ఈ కొత్త వాట్స్అప్ వివాదానికి క్లారిటీ రాదు