Begin typing your search above and press return to search.

క్రిష్ ఫెయిల్యూర్ పై రంగోలి ఖుషీగా ఉన్నట్టుందే!

By:  Tupaki Desk   |   24 Feb 2019 7:53 AM GMT
క్రిష్ ఫెయిల్యూర్ పై రంగోలి ఖుషీగా ఉన్నట్టుందే!
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు తెలిసిన వారికి.. ఆమెకు సంబంధిన వార్తలు వివాదాలను ఫాలో అయ్యేవారికి కంగనా సోదరి రంగోలి చందేల్ పేరు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆమె వాదన ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే.. కంగనాపై ఒక ఈగ వాలినా కూడా ఆమె సహించదు. ఎవరు కంగనాపై విమర్శలు చేసినా వాళ్ళపై మాటల తూటాలు పేలుస్తుంది. ఒక సోదరిగా చూస్తే మాత్రం ఆమెను ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి.

కానీ కంగనా వ్యతిరేకుల విషయంలో ఒక్కోసారి హద్దుదాటి విమర్శిస్తుంది. రీసెంట్ గా ఒక ఒక నెటిజన్ "క్రిష్ దర్శకత్వం వహించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఫెయిల్యూర్ తర్వాత రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజై అదే బాటలో పయనిస్తోంది. ఇదంతా చూస్తుంటే 'మణికర్ణిక' ను కంగనా డైరెక్ట్ చేయడం కరెక్టేమో అనిపిస్తోంది" అని ట్వీట్ చేశారు. దీనికి రిప్లై గా రంగోలి "ఒక బిగ్ బడ్జెట్ ఫిలిం ఇబ్బందిలో ఉన్నప్పుడు దాన్ని కాపాడేందుకు ధీరత్వం ఉన్న మహిళ ముందుకు వచ్చి నిర్మాతకు.. ప్రతిభావంతులైన ఇతర టీమ్ మెంబర్లకు తోడుగా నిలిచి అందరినీ తలెత్తుకునేలా చేసింది. కొంతమంది ఆమెపై విషం చిమ్ముతున్నా కూడా ఆమె ఈ ఘనత సాధించింది. ఆమెకు ఈ గుర్తింపు అవసరం. కంగన నిజమైన హీరో. థ్యాంక్ యూ" అంటూ తన సోదరి ఘనతను మరోసారి చాటింది.

ఇక్కడ రంగోలి డైరెక్ట్ గా క్రిష్ పై విమర్శలు చేయనప్పటికీ మునిగిపోతున్న పడవలాంటి 'మణికర్ణిక' ను తన టాలెంట్ తో కంగన ఒడ్డుకు చేర్చింది అనిచెప్పడం.. కంగనా ను హీరో అనడం..కంగనాపై విషం చిమ్మారని అనడం.. ఇవంతా క్రిష్ ను పరోక్షంగా టార్గెట్ చేసేవే. అయినా ఎన్టీఆర్ బయోపిక్ తో 'మణికర్ణిక' సినిమాను ఎవరైనా పోలుస్తారా? ఆ బ్లడ్డు వేరు.. ఆ బ్రీడ్ వేరు! హిందీవాళ్ళకు ఇక్కడి విషయాలు తెలియవు కదా!