Begin typing your search above and press return to search.

చెల్లికి సెలువలు ఇచ్చేసిన కంగనా

By:  Tupaki Desk   |   5 May 2017 7:35 AM GMT
చెల్లికి సెలువలు ఇచ్చేసిన కంగనా
X
టీనేజ్ వయస్సులో ఒక ఆగంతకుడు చేసిన యాసిడ్ ఎటాక్ దాడితో గాయపడింది కంగనా రనౌత్ చెల్లెలు రంగోలి రనౌత్. ఆ తరువాత నుండి ఆమె ముంబాయ్ లో కంగనతోనే ఉంటోంది. అంతేకాదు.. కంగన మ్యానేజర్ గా వ్యవహరిస్తూ.. అక్కయ్యకు సంబంధించిన ఎటువంటి బిజినెస్ డీలింగ్ అయినా కూడా స్వయంగా తనే డిసైడ్ చేస్తోంది. అలాగే కంగనకు కూడా తన అక్కయ్య అంటే ప్రాణం.

ఇక 2011లో తన చిన్ననాటి స్నేహితుడు అజయ్ చెందేల్ ను పెళ్ళి చేసుకుంది రంగోలి. ఆ సమయంలో చెల్లెలకు ముంబాయ్ లో ఒక అపార్ట్ మెంట్ గిఫ్టుగా ఇచ్చింది కంగన. దురదృష్టం ఏంటంటే.. ఆ తరువాత ఓసారి ప్రెగ్నెంట్ అయిన రంగోలి.. పని ప్రెజర్ కారణంగా తన గర్భాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. అందుకే ఈసారి అటువంటి ఇబ్బందులేమీ రాకూడదని.. ఆమెకు వర్క్ నుండి రిలీఫ్‌ ఇచ్చిందట కంగన. గతంలో ''సిమ్రాన్'' షూటింగ్ సమయంలో రంగోలి వర్క్ కారణంగా ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడంతో.. ఇప్పుడు ''మణికర్ణిక'' సినిమా షూటింగ్ బాధ్యతల నుండి ఆమెను తప్పించారట. ఆ విధంగా ఈ అక్కయ్య చెల్లెలకు సెలవలు ఇవ్వడంలో ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఏదేమైనా కూడా కంగన తాను తీసుకునే డెసిషన్లతో ఎప్పటికప్పుడు బాలీవుడ్ ను షాక్ చేస్తూనే ఉంటుంది. వెల్ డన్ కంగన!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/