Begin typing your search above and press return to search.
ఓపెన్ లెటర్ రాసినందుకు తిట్టేసింది
By: Tupaki Desk | 9 Sep 2017 11:33 AM GMTప్రస్తుత రోజుల్లో తారలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర తారలపై కాస్త నెగిటివ్ గా కామెంట్ చేసినా నిజంగానే గొడవ జరిగిందేమో అనేట్టుగా మీడియాలో కథనాలు వెలువడుతుంటాయి. ఇక వారు నిజంగానే కోపంతో కామెంట్ చేస్తే ఇంకేమైనా ఉందా.. ఆ న్యూస్ జనాలకు ఎక్కే వరకు బ్రేకింగ్ న్యూస్ అంటూ యాడ్స్ లేకుండా ప్రసారం చేసేస్తారు.
ఇప్పుడు అదే తరహాలో కంగనా రనౌత్ కామెంట్స్ కి సంబందించిన న్యూస్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ మీడియా ఈ టాపిక్ ను ఏ మాత్రం విడువడం లేదు. అయితే రీసెంట్ గా ఈ వివాదంలోకి మరో తార చేరుకుంది. హృతిక్ పై చేసిన ఆరోపణలకు బదులుగా బాలీవుడ్ గాయని సోనా మొహాపాత్ర.. కంగనకు బహిరంగ లేఖ రాసింది. అంతే కాకుండా 'సిమ్రన్' సినిమా ప్రచారంలో భాగంగానే ఫ్రీ పబ్లిసిటీ కోసమని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని లేఖలో పెర్కనడంతో ఈ విషయంపై కంగనా సైలెంట్ గా ఉన్నా ఆమె సోదరి రంగోలి మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది.
తన ట్విట్టర్ ద్వారా రంగోలి ఈ విధంగా స్పందించింది. 'మనస్ఫూర్తిగా ఒకరు వారి అభిప్రాయాలు చెప్పుకుంటే సర్కస్ అని చెప్పకు. వ్యక్తిగత జీవితంలో జరిగే పరిణామాలు సినిమాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు. ముందు నువ్వు మహిళా లోకానికి పెద్ద మచ్చ లాంటిదానివి. నీలాంటి వాళ్లే పబ్లిసిటీ కోసం పనికిరాని విషయాలపై కామెంట్స్ చేస్తుంటారు' అని ఆగ్రహంతో స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ న్యూస్ లో కూడా ఈ న్యూస్ మరో స్థాయికి చేరింది.