Begin typing your search above and press return to search.
తాప్సీపై మళ్లీ విరుచుకుపడ్డ అపర చండిక
By: Tupaki Desk | 25 Sep 2019 8:15 AM GMTక్వీన్ కంగన సోదరి రంగోళి చండేల్ అలియాస్ అపర చండిక మరోసారి రంగంలోకి దిగింది. హృతిక్ తో కంగన వివాదం.. `మణికర్ణిక` సమయంలో దర్శకుడు క్రిష్ తో వివాదం...రైటర్ డైరెక్టర్స్ కాంట్రవర్శీలు.. ఇలా బాలీవుడ్ లో ఎవరు కంగనతో పెట్టుకున్నా తనని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసిన కంగన సిస్టర్ రంగోలీ చండేల్ శత్రువు చమడాలు వలిచేస్తోంది. గత రెండు నెలలుగా రంగోలీ టార్గెట్ మారిపోయింది. ఆమె కన్ను పూర్తిగా తాప్సీపై పడింది. అప్పటి నుంచి తాప్సీని టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియా వేదికగా పదునైన విమర్శలు చేస్తూ రఫ్ఫాడించేస్తోంది. తాప్సీతో రంగోలి ఎపిసోడ్స్ తెలిసిందే. ఈ సీక్వెన్సుల్లో భాగంగా మరోసారి తాప్సీపై రంగోలీ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం తాజా చిత్రం `సాంద్ కీ ఆంఖ్`. షూటర్స్ గా రాణించిన ఓల్డ్ చంద్రోతోమర్ సిస్టర్స్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
ఈ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్రలో నటించమని మేకర్స్ తొలుత కంగననే సంప్రదించారట. అయితే ఆ పాత్రని వయసు మళ్లిన నటులతో చేయిస్తేనే బాగుంటుందని కంగన ఆ పాత్రని తిరస్కరించింది. ఇదే విషయాన్ని రంగోలీ చండేల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించి దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ``డియర్ నిఖిల్.. మీటూని ఇండియాలో మీడియా చంపేయడం హృదయాన్ని కలిచివేస్తోంది. మీటూ.. ఫెమినిజమ్ ఇండియాలో ఓ జోక్ గా మారింది. వికాస్ బెహెల్ తో పాటు ఈ చిత్ర దర్శకుడు ముందు కంగనానే కోరుకున్నారు. అయితే కంగన ఈ సినిమాని ఓల్డ్ ఆర్టిస్టులతోనే చేయాలని తెలిపింది`` అని రంగోలి వ్యాఖ్యానించింది.
నీనా గుప్తా.. రమ్యకృష్ణలతో చేస్తే బాగుంటుందని కంగన మనసులో ఫీలైంది. వాళ్లు మెయిన్ స్ట్రీమ్ నటులు కారా? అని ప్రశ్నించింది. అక్కడితో ఆగని చండేలీ తాప్సీని ఎడాపెడా రఫ్ఫాడించేసింది. `నీకు ఇంకా నటనే రాదు. ఏదో పై పై యాక్టింగ్ నేర్చుకుని నీకు నువ్వే లెంజెండ్ లతో పోల్చుకుంటున్నావు. సిల్వర్ హెయిర్.. సస్తా ప్రోస్తటిక్ మేకప్ వేసుకోగానే నటివి కాలేవు. 60 ఏళ్ల పాత్రలో నటించాలంటే కావాల్సింది ప్రోస్తటిక్ మేకప్ కాదు. బాడీ ల్యాంగ్వేజ్.. ఆ ఏజ్ కు తగ్గ వాయిస్ ఎక్కడుంది నీ పాత్రలో? యంగ్ గా కనించే నిన్ను.. నీ మేకప్ ని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు` అని చీల్చి చండాడేసింది.