Begin typing your search above and press return to search.
మళ్లీ క్వీన్ ఆఫ్ ఝాన్సీలా గుర్రపు స్వారీ చేస్తుందా?
By: Tupaki Desk | 24 Jun 2021 8:30 AM GMTదివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత జీవిత కథ-తలైవిలో కంగన నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా `తలైవి` తమిళ వెర్షన్ కు `యు` సర్టిఫికేట్ ఇచ్చారు. విబ్రీ మీడియా ట్విట్టర్ లో ఈ వార్తలను అభిమానుల కోసం షేర్ చేసింది. తెలుగు- హిందీ వెర్షన్లకు సెన్సార్ షిప్ సర్టిఫికేట్ త్వరలోనే అందనుందని విబ్రి సంస్థ ప్రకటించింది.
ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా.. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ఇది బహుభాషా చిత్రం. ఒకే రోజున అన్ని భాషలలో విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ ఇప్పటివరకూ వీలు పడలేదు. కంగనా రనౌత్ 34 వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 23 న ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 59 సెకన్ల ట్రైలర్ లో దివంగత నటి.. రాజకీయ నాయకురాలు జయలలిత జీవితంలో పలు దశలను ఆవిష్కరించారు. జయలలిత సినిమా ప్రపంచం నుండి రాజకీయ ప్రపంచానికి మారే క్రమాన్ని చూపించారు. అరవింద్ స్వామి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ పాత్రలో నటించారు.
ఓవైపు తలైవి రిలీజ్ ప్రమోషన్స్ కోసం ప్రిపేరవుతున్న కంగన .. ధాకడ్ అనే భారీ యాక్షన్ సినిమా కోసం ప్రిపరేషన్ సాగిస్తోంది. ఇదిలా ఉండగానే క్వీన్ తనకు ఎంతో ఇష్టమైన హార్స్ రైడింగ్ పై ఫోకస్ పెట్టిందని తాజాగా రివీలైన ఈ ఫోటోలు చెబుతున్నాయి.
క్వీన్ కంగన పర్ఫెక్ట్ గా హార్స్ రైడింగ్ కోసం తన గుర్రాన్ని ప్రిపేర్ చేస్తోందని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. అలా తలకు సేఫ్టీ క్యాప్ తోపాటు కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ని ధరించి కౌబోయ్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. ఇంతకుముందు మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ కోసం గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేసిన కంగనకు ఇప్పుడు హార్స్ రైడింగ్ నిత్య వ్యాపకంగా మారినట్టే కనిపిస్తోంది. ధాకడ్ కూడా భారీ యాక్షన్ చిత్రం కాబట్టి గుర్రపు స్వారీ విన్యాసాలతో మెప్పిస్తుందేమో చూడాలి.