Begin typing your search above and press return to search.

క్రిష్ ని కంగనా ఓవర్ టేక్ చేస్తోందా?

By:  Tupaki Desk   |   22 Aug 2018 8:45 AM GMT
క్రిష్ ని కంగనా ఓవర్ టేక్ చేస్తోందా?
X
దర్శకుడు క్రిష్ రెండు పడవల మీద చేస్తున్న సాహస ప్రయాణం అటు రిస్క్ తో పాటు పుకార్లను మోసుకొస్తోంది. నిజమో కాదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా జరుగుతున్న పరిణామాలు నిజమే అనిపించేలా కనిపిస్తుండటంతో వాటికి వేగంగా రెక్కలు వస్తున్నాయి. ఒకపక్క ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చేస్తూనే మరోపక్క ముంబై వెళ్లి వస్తూ మణికర్ణిక ప్యాచ్ వర్క్ ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్న క్రిష్ ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. ఇకపోతే బాలన్స్ ఉన్న కొద్దిపాటి షూటింగ్ కంగనా రౌనత్ తనే స్వయంగా డైరెక్ట్ చేస్తూ పూర్తి చేస్తోందని క్రిష్ కు రావాల్సిన పేరు పూర్తిగా అందకుండా తన షేర్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని ముంబై మీడియా కోడై కూస్తోంది. దానికి తగ్గట్టే ఇక్కడ ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే అక్కడ మణికర్ణిక సీన్స్ పూర్తి చేయటం వెనుక కారణం ఇదేగా కనిపిస్తోంది. క్రిష్ మాత్రం మీడియా దొరికేంత వీలులో లేడు. గ్యాప్ దొరకడమే గగనమైపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో వీటిని పట్టించుకుని బదులు చెప్పే స్థితిలో లేడు కాబట్టి రెండూ ఒకే నెల విడుదలను టార్గెట్ చేసుకున్న నేపధ్యంలో క్రిష్ ధ్యాస మొత్తం వీటి మీదే ఉంది. మణికర్ణిక డేట్ జనవరి 25 అని ప్రకటించారు కాబట్టి ఇక మార్పు లేనట్టే. హృతిక్ రోషన్ సూపర్ 30 కూడా అదే తేదీకి ప్లాన్ చేస్తున్నారని తెలిసినా కంగనా మాత్రం వెనక్కు తగ్గే దిశగా ఆలోచించడం లేదట. మరోవైపు ఎన్టీఆర్ జనవరి 9కి ఫిక్స్ అయినట్టు గతంలోనే టాక్ వచ్చింది. ఒకవేళ ఏదైనా చిన్న మార్పు ఉన్నా మరో రెండు మూడు రోజులు తేడా ఉంటుంది అంతే. సో క్రిష్ కు పేరు వస్తోందా కంగనా లాగేసుకుంటోందా అనే ప్రశ్నలకు సమాధానం కన్నా రెండూ జనవరి మొదటివారానికి ఖచ్చితంగా ఫస్ట్ కాపీ రెడీ చేయాల్సిన బాధ్యత అయితే క్రిష్ మీద ఉంది.