Begin typing your search above and press return to search.
అప్పుడు సవాల్ ఇప్పుడు రిక్వెస్ట్.. ఈమె స్టైల్ వేరు
By: Tupaki Desk | 8 Sep 2021 9:31 AM GMTఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సాఫ్ట్ గా మాట్లాడటం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె నుండి రిక్వెస్ట్ లు కంటే హెచ్చరికలు ఎక్కువగా వింటూ ఉంటాం. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆమె ఏకంగా యుద్దమే చేసింది. అంతకు ముందు వరకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ స్టార్స్ తో మాత్రమే విభేదాలు పెట్టుకుంటూ వచ్చిన ఈమె గత ఏడాది ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడింది. ఆ కారణంగా తన ఖరీదైన ఆఫీస్ ను అక్రమ కట్టడం పేరుతో కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మహా ప్రభుత్వంపై కంగనా ఫైరింగ్ కాస్త తగ్గించింది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా థాక్రే ప్రభుత్వంపై కంగనా విరుచుకు పడటం ఖాయం అనుకుంటూ ఉండగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంకు కంగనా ఒక విజ్ఞప్తి చేసింది.
గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలో థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఎంతో మంది కార్మికులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కనుక దయచేసి థియేటర్లు పునః ప్రారంభంకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వంకు లేఖ రాసింది. కరోనా కేసులు గతంతో పోల్చితే చాలా వరకు తగ్గాయి. కనుక ఇప్పుడు థియేటర్లను పునః ప్రారంభించడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అంటూ పేర్కొంది. కంగనా లేఖకు ప్రభుత్వం నుండి స్పందన ఏం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంగనా అంటే మహా ముఖ్యమంత్రికి పీకల వరకు కోపం ఉంది. కనుక ఆమె విజ్ఞప్తి ని ఎంత వరకు పట్టించుకుంటారు అనేది అనుమానం.
కంగనా ఇండస్ట్రీ మొత్తం గురించి ఆలోచించి ఈ లేఖ రాసి ఉంటే సరే అనుకునే వాళ్లేమో. కాని ఆమె తలైవి సినిమా ఈ వారంలో విడుదలకు సిద్దంగా ఉంది. కనుక ఆమె నుండి ఈ లేఖ ప్రభుత్వంకు వెళ్లింది. కనుక ఖచ్చితంగా ఆమెకు అనుకూలంగా ప్రకటన రాకపోవచ్చు అంటున్నారు. తలైవి సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా ఎలా కనిపించబోతుంది.. అందుకు తగ్గట్లుగా ఎలా మారింది అంటూ చర్చ జరుగుతోంది. మొదటి నుండి ఉన్న అంచనాల నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని సినిమా విడుదలకు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. మహారాష్ట్రతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు ఓపెన్ లేవు. అందుకే రెండు వారాల్లోనే హిందీ వర్షన్ ను ఓటీటీ ద్వారా విడుదల చేస్తామని అంటున్నారు.