Begin typing your search above and press return to search.
#క్లీన్ బాలీవుడ్: దీపిక .. సారా.. శ్రద్ధాలకు NCB చర్యపై క్వీన్ కామెంట్
By: Tupaki Desk | 24 Sep 2020 5:45 AM GMTబాలీవుడ్ లో డ్రగ్స్ డొంక పూర్తి స్థాయిలో కదిలి పోతోంది. రోజు లు గడుస్తున్నా కొద్దీ ప్రకంపనలు సృష్టిస్తూనే వుంది ఈ వ్యవహారం. ఈ కేసులో నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) రోజు రోజుకూ బాలీవుడ్ పై పట్టు బిగిస్తూనే వుంది. క్లీన్ బాలీవుడ్ లో భాగంగా డ్రగ్ కంట్రోల్ బోర్డ్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అవుతోంది. ఇందులో భాగంగా వరుసగా సెలబ్రిటీలకు సమన్లు జారీ చేస్తూనే వుంది. రియా అరెస్ట్ తరువాత తాజాగా డ్రగ్స్ కి సంబంధం వుందని అనుమానాలు వ్యక్తమవుతున్న సారా అలీఖాన్- శ్రద్ధా కపూర్- దీపికా పదుకొనే- రకుల్ ప్రీత్ సింగ్- డిజైనర్ సైమన్ కంబట్టాలకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆ మేరకు జాతీయ మీడియా సహా లోకల్ మీడియాల్లో సంచలన కథనాలు వేడెక్కిస్తున్నాయి.
ఇందులో నలుగురు క్రేజీ హీరోయిన్ లకు ఎన్సీబీ అధికారులు స్వయం గా ఇంటికి వెళ్లి సమన్లు జారీ చేయడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఇందులో సారా అలీఖాన్- శ్రద్ధా కపూర్ ల ఇంటికి వెళ్లి సమన్లు అందజేశారట. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఇద్దరూ ఎన్సీబీ ముందు ఈ నెల 26న విచారణ కు హాజరు కానున్నారు. ఇదే సమయంలో దీపికకు సమన్లు అందాయి. అయితే ఆమె గోవాలో ఆన్ లొకేషన్ షూటింగ్ లో వుండటం వల్ల ఆమెకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఎన్సీబీ అధికారులు వెల్లడించారట. ఈ నెల 25న దిపిక విచారణ కు హాజరు కానుంది. రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఫోన్ ద్వారానే విషయం వెల్లడించారట. 24న రకుల్ విచారణకు హాజరు కావాల్సి వుంటుందని చెబుతున్నట్టు జాతీయ మీడియా కథనా లు వేడెక్కించాయి.
అయితే ఈ నేపథ్యంలో కంగన వీరందరినీ ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచనంగా మారింది. ``సుశాంత్ హత్యకు గురవ్వలేదు.... కంగనకు అన్యాయం జరగలేదు!! అని భావించే బాలీవుడ్ మాఫియా తొలిసారి వారి అకృత్యాలకు.. శాడిజానికి చింతిస్తూ తమ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసి వుంటారు`` అని ఘాటైన పదజాలంతో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.