Begin typing your search above and press return to search.
అలాగైతే నేను రైతు కావాలన్న హీరోయిన్
By: Tupaki Desk | 23 July 2017 5:21 AM GMTబాలీవుడ్ లో ఇప్పుడు ఎవరు నోట విన్న ఏ ఇంటర్వ్యూ చూసిన సినీ వారసత్వం పై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎప్పటి నుండో చేస్తున్న కంగనా రనౌత్ ఒక టాక్ షో లో అన్న మాటలు తో మరింత తీవ్ర స్థాయికి చేరి ఇప్పుడు ఇలా ఒకరికి ఒకరు వివరణ, క్షమాపణ చెప్పుకునే పరిణామాలు వరకు వచ్చింది. కొద్ది రోజులు కిందట జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో కరణ్ జోహార్ - వరుణ్ ధావన్ - సైఫ్ అలీఖాన్ లు కలిసి వారసత్వంపై కొన్ని జోక్లు వేశారు. అవి కంగనా రనౌత్ పై పరోక్షంగా అన్నమాటలే అని అందరికీ తెలుసు. దానికి వారు క్షమాపణలు చెప్పేదాకా వెళ్లింది. శుక్రవారం కంగనాకు క్షమాపణలు చెబుతూ సైఫ్ అలీ ఖాన్ ఓ లేఖ కూడా రాశాడు. దానికి జవాబుగా కంగనా ఒక 'ఓపెన్ లెటర్' రాస్తూ వారసత్వం పై తన మాటకు ఎప్పటికి మారదు అని చెబుతూ ఇలా ఒక లేఖ రాసింది.
“అవార్డ్ షో లో జోక్ లు చూశాను కొన్ని బాగానే అనిపించినా కొన్ని చికాకు పుట్టించాయి. నేను ఈ విషయం పై నా అభిప్రాయాన్ని ఎప్పుడో చెప్పాను. దానికి కరణ్ జోహర్ కూడా ఒక బ్లాగ్ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పారు. అది చదివి మరింత భాడపడ్డాను. ఇప్పుడు సినిమాలనేవి జీన్స్ లో ఉన్నాయంటూ సైఫ్ ఆలీ ఖాన్ చెప్పడం ఇంకా కామెడీగా ఉంది. కళకు వారసత్వానికి ఎటువంటి సంబందం లేదు. దిలీప్ కుమార్ - కే ఆసిఫ్ - బిమల్ రాయ్ - సత్యజిత్ రే - గురు దత్ లాంటి గొప్ప గొప్పవాళ్లు వాళ్ళ కుటంబం సినిమా వ్యాపారంలో ఉంటేనే వచ్చారా? వాళ్ళు ఇంత తార స్థాయికి చేరుకున్నారంటే ఏ జీన్స్ వలన అని ప్రశ్న వేసింది. నా కుటంబ పరిస్థితికి నా కష్టానికి నా కళ నైపుణ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక వేళ మీరు అన్నట్లు ఉంటే నేను నా జీన్స్ ప్రకారం ఇప్పుడు ఒక రైతు కావాలి. కానీ నటి ఎలా అయ్యాను?'' అంటూ బుల్లెట్లు పేల్చింది కంగన.
''వారసత్వం అనే పదం అనవసరంగా ఎక్కువగా మాట్లాడి దానికి ఎక్కువ విలువ ఇవ్వకండి. నా మాటలను తప్పుగా అర్ధం చేసుకోకండి. ఇది నా ఒక్కదాని సమస్య కాదు నేను మాట్లాడుతుంది ఒక మనిషికో లేక ఒక గ్రూప్ నో ఉద్దేశించి అన్నమాటలు కావు. కష్టం కళ అనేవి ఎవరి సొత్తు కాదు అది సమాజపు సహజ వనరులు అని చెబుతున్నాను'' అంటూ ముగించింది. ఏదేమైనా కూడా కంగన స్టయిలే వేరబ్బా!!